Monday, November 25, 2024

శ్రీసాయి కలిగించిన ఆధ్యాత్మిక జాగృతి

కెప్టెన్‌ హాటే అనే అతను బికానేరులో నివసించేవాడు. అత ను బాబాకు కూర్మి భక్తుడు. నిత్యం ధూప, దీప నైవేద్యాలతో బాబాకు పూజ చేయనిదే పచ్చి గంగైనా ముట్టేవాడు కాదు. అతనికి సాయి ఏవి ధంగా ఆధ్యాత్మిక జాగృతి కలిగించారో మరోసారి స్మరించుకుందాం.
ఒకరోజు బాబా హటేకు స్వప్నంలో కనిపించి ”నన్ను మరిచావా” అని ప్రశ్నించారు. హాటే వెంటనే సాయి కాళ్ళపై పడి ”బిడ్డ తల్లిని మరి స్తే ఇక బ్రతుకగలదా?” అని అన్నాడు. తర్వాత హటే తోటలోనికి వెళ్ళి చిక్కుడు కాయలను కోసి తెచ్చి శ్రీ సాయికి స్వయం పాకం క్రింద సమ ర్పించుకున్నాడు. ఇంతలో కల చెదిరిపోయింది. ఇది శ్రీ సాయి తనకు పంపించిన సందేశం క్రింద తలిచి వెంటనే స్వయంపాకం, దక్షిణలను శిరిడీకి పంపించాలని నిర్ణయించుకున్నాడు. బొంబాయిలో వుండే తన స్నేహతునికి పన్నెండు రూపాయలు మనీ ఆర్డరు చేసి అందులో పది రూపాయలు దక్షిణ క్రింద, మిగిలిన రెండు రూపాయలతో చిక్కు డు కాయలను కొని స్వయంపాకం క్రింద శ్రీ సాయికి సమర్పించమని జాబు రాశాడు. ఆ స్నేహతుడు శిరిడీకి వచ్చి చిక్కుడు కాయల కోసం ఎదురు చూసాడు కానీ చాలాసేపటి వరకు దొరకలేదు. నిరాశతో వాడా లో కూర్చొని వుండగా ఆశ్చర్యకరంగా ఒక స్త్రీ తలపై గంపలో చిక్కుడు కాయలతో వాడాకు వచ్చింది. ఇది శ్రీ సాయి పంపిన అవకాశంగా భావించి ఆ స్నేహతుడు చిక్కుడు కాయలను కొని దక్షిణతోపాటు స్వయంపాకం హాటే పక్షాన సాయికి సమర్పించాడు. మర్నాడు మరి న్ని చిక్కుడు కాయలతో కూర చేయించి సాయికి సమర్పించగా ఆ రోజు భోజనంలో సాయి ఇతర పదార్ధాలను మాని చిక్కుడుకాయ కూ రతోనే భోజనం చేసారు. ఆ స్నే#హతుడికి ఊదీ ప్రసాదాలను ఇచ్చి ”ఏ చీకూ చింతా లేకుండా సంతోషంగా వుండండి” అని ఆశీర్వదించారు. శిరిడీలో జరిగిన విషయాన్ని స్నేహతుని ద్వారా తెలుసుకున్న కెప్టెన్‌ హాటే ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
ఇంకొకసారి హాటేకు సాయి పవిత్రం చేసి ఇచ్చిన రూపాయి బిళ్ళ ను తన పూజా మందిరంలో వుంచుకొని నిత్యం పూజించుకోవా లన్న పవిత్ర సంకల్పం కలిగింది. అతని స్నేహతుడొకరు శిరిడీ వెళ్తుం డగా అతనికి ఒక రూపాయి నాణం ఇచ్చి తన మనసులోని కోరికను చెప్పాడు. ఆ స్నేహతుడు శిరిడీ వెళ్ళి

సాయిని దర్శిం చుకొని రూపాయిని సమ ర్పించుకున్నాడు. అతడు ఏదో చెప్పబోయేంతలో సాయి ఆ రూపాయి నాణంతో కాస్సేపు క్రిందకు, పైకి ఎగుర వేసి తిరిగి స్నేహతునికి ఇచ్చి ”ఈ రూపాయి నీ స్నేహ తునికి ఇచ్చి నిత్యం పూజించుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. నాకేం సమర్పించనవసరం లేదు. అతనిని సదా ఆనందంగా వుండమను” అని ఆశీర్వదించారు. తాను ఏమీ చెప్పకుండానే, తన మనస్సులోని మాటను తెలుసుకొని శ్రీ సాయి ఎలా ఆశీర్వదించారా అని ఆ స్నేహ తుడు ఆశ్చర్యపోయా డు. గ్వాలియర్‌ తిరిగివెళ్ళి హాటేకు సాయి ఇచ్చిన రూపాయి ఇచ్చి సాయి ఇచ్చిన సందేశాన్ని తెలియజేసాడు. ఆ రూపాయి నాణన్ని తన పూజా మందిరంలో పెట్టుకొని నిత్యం హాటే పూజింపనారంభించా డు. ఆ రోజు నుండి హాటే జీవితంలో గొప్ప మార్పు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement