Friday, September 20, 2024

జన్మ సార్థక్యానికి శ్రీసాయి సూచనలు

శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో (8వ అధ్యాయం, 5- 6 శ్లోక ములు) ”ఎవరైతే తమ అంత్యదశ యందు నన్నే జ్ఞప్తి కుంచుకొనె దరో వారు నన్నే చేరెదరు. ఎవరైతే మరొక దానిని తలచెదరో వా రు దానినే పొందెదరు” అని ప్రవచించాడు. తమ అవసాన కాల మందు భగవంతుడిని లేదా సద్గురువును తలచేవారు మరణం అనంతరం ఆ భగవంతుడు లేదా సద్గురువు అనుగ్రహ ఫలం వలన అతనిలో ఐక్యం అవుతారు. చివరి వరకు విషయ ధ్యానం చేసేవారు ఆ విషయ లంపటంలో పడి తిరిగి మరొక జన్మ ఎత్తు తారు. ఇట్టివారికి వేయి జన్మలకైనా ముక్తి లభించదు. అయితే ఈ కలియుగంలో అందరకూ తమ అంత్యకాలమందు భగవంతు ని ధ్యానం లభిస్తుందన్న నమ్మకం లేదు. మరణం అంటే కొందరి కి భయం, మరికొందరికి తాము కూడబెట్టిన ఆస్తిపాస్తుల యం దు మక్కువ వదులుకోలేరు. అందుకనే చిన్నప్పటి నుండి సన్మా ర్గంలో నడుస్తూ, ఆరోగ్యకరమైన ఆలోచనలను చేస్తూ, భగవ న్నామ స్మరణతో మనస్సును నిలకడగా వుంచుకునేవారికి పైన చెప్పిన సాధన సులభతరం అవుతుంది. అలా తన అవసాన దశ లో భగవత్‌ ధ్యానం ఒనరించి ముక్తిని పొందిన ఒక సన్యాసి కథ ఇప్పుడు స్మరించుకుందాము.
మద్రాసులో నివసించే విజయానంద్‌ అనే ఒక సన్యాసి మా నస సరోవరం యాత్రకై బయలుదేరాడు. మధ్య మార్గంలో శ్రీ సాయి యొక్క వైభవమును గూర్చి విని ఆయనను దర్శించుకుం దామని శిరిడీకి వచ్చాడు. అక్కడ హరిద్వార్‌ నుండి వచ్చిన మరొక సన్యాసిని కలుసుకున్నాడు. మాటల సందర్భంలో తాను చేయబోయే మానస సరోవరం యాత్ర చాలా కష్టముతో కూడు కున్నదని, మంచు ప్రదేశం కావడాన ప్రయాణం చాలా కష్టమని, భూటాన్‌ ప్రజలు అడుగడుగునా యాత్రికులకు కష్టాలు కలగజే స్తారని ఆ హరిద్వార్‌ సన్యాసి ద్వారా విని, ఎంతో నిరాశకు గురై అప్పటికప్పుడే తన మానస సరోవర్‌ యాత్రను విరమించుకు న్నాడు. ఆ తర్వాత మశీదులోని సాయిని దర్శించుకోగా, శ్రీ సా యి తీవ్రమైన ఆగ్రహంతో ”ఈ పనికి మాలిన సన్యాసిని బయట కు తరిమివేయండి, ఇతని సాంగత్యం మనకు మంచిది కాదు” అ ని అరిచారు. శ్రీ సాయికి ఈవిధమైన ఆగ్రహం ఎందుకు కలిగిం దో అర్ధంకాక విజయానందుడు మశీదులో ఒక మూల కూర్చొని అక్కడి విషయాలను గమనించసాగాడు. ఆ సమయంలో మశీ దు కిక్కిరిసి వుంది. ఎందరో భక్తులు తమ బాధలను శ్రీ సాయికి చెప్పుకుంటూ శ్రీ సాయి నుండి పరిష్కారం పొందుతున్నారు. వివిధ రకాల భక్తులు వివిధ పద్ధతులలో శ్రీ సాయిని పూజిస్తున్నా రు. అక్కడ వున్న వారికి కుల, మత, జాతి, వర్గ, ప్రాంతీయ భేధా లు, వర్గ వైషమ్యాలు, తారతమ్యాలు లేవు. అందరిపై సమానం గా శ్రీ సాయి తన కరుణామృత చూపులతో అనుగ్రహాన్ని కురిపి స్తున్నారు. బాధలతో, దు:ఖంతో వచ్చిన వారు ఆనందంగా తిరి గి వెళ్తున్నారు. దీనంతటినీ గమనిస్తున్న విజయానందుడికి శ్రీ సాయిపై విశ్వాసం, భక్తి, ప్రేమ మరింత ఎక్కువయ్యాయి. అక్క డే మరికొంత సమయం గడుపుదామని నిర్ణయించుకున్నాడు. అతడు శిరిడీలో మరి రెండు రోజులున్నాక తల్లికి జబ్బు చేసిం దని తన గ్రామం నుండి జాబు వచ్చింది. అందుకని తక్షణం ఆ ప్రదేశం విడవాలని తలిచి శ్రీ సాయి ఆజ్ఞ కోసం విజయానందు డు మశీదుకు వచ్చాడు. శిరిడీని విడవడం ఇష్టం లేక ఒకవైపు, తల్లి ఆరోగ్యం క్షీణించిందన్న బాధ మరొక వైపు, ఈ విధంగా ద్వంద్వ భావాలతో సతమతమౌతూ మనస్సు కలత చెందగ శ్రీ సాయికి సాష్టాంగ నమస్కారం చేసి మద్రాసుకు వెళ్ళడానికి ఆజ్ఞ వేడాడు. శ్రీ సాయి సర్వజ్ఞులు, సర్వ శక్తిమంతులు గావున జరుగ బోయే దానిని గ్రహంచి విజయానందుడితో ”సన్యాసం స్వీక రించిన వారికి ఇక మమకారం తగదు. వారు దేని యందూ మమకారం వుంచుకొనరాదు. కొద్ది రోజులు ఓపిక పట్టి వుండు. ఇపర లోకములలోనున్న ఐహక పరమైన విషయాల పట్ల వాంఛను త్యజించు. వివేక వైరాగ్యములతో, నిత్యానిత్యములకు గల బేధమును గ్రహంచి ఆ భగవంతుని పాదాలను శరణు వేడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో, ప్రేమానురాగాలతో ఆ భగవంతుడి ని ధ్యానిస్తారో, ఆపదలలో ఆ భగవంతుడు స్వయంగా పరిగెత్తు కు వచ్చి తన భక్తులను రక్షిస్తాడు. ఇది సత్యం. ఈ మాటలను నీ హృదయంలో పదిలపరచుకొని, నిష్కామంతో, ఏ కోరికలు లేక రేపటి నుండి భాగవతం పారాయణం చెయ్యి. భక్తిశ్రద్ధలతో మూ డు వారాలు పారాయణం చేస్తే ఆ భగవంతుడు కరుణతో నిన్ను రక్షిస్తాడు. నీ కలతలను, సమస్యలను విచారములను శీఘ్రమే తొలగిస్తాడు.” అని అపూర్వమైన రీతిలో బోధ చేసారు. సన్యాసి అయిన విజయానందుడికి మరణం సమీపించెనన్న సంగతి తెలుసుకున్న శ్రీ సాయి అతనికి సద్గతి ప్రసాదించే నిమిత్తమై ఈ సాధనను అతడికి ఉపదేశించారు. శ్రీ సాయి ఆజ్ఞను తుచ తప్పక పాటించిన వజానందుడు మర్నాటి నుండి లెండీ తోటలో భక్తి శ్రద్ధలతో, ఏకాగ్రతతో భాగవతం పారాయణ ప్రారంభించాడు. రెండు పారాయణలు పూర్తి చేయగానే అలిసిపోయాడు. భగవ న్నామ స్మరణం చేస్తూ బడేబాబా తొడపై ప్రాణాలను వదిలాడు.
ఆవిధంగా పవిత్రమైన శిరిడీ క్షేత్రంలో శ్రీ సాయి సద్గురువు సన్నిధిలో అతి పవిత్రమైన భాగవత గ్రంథమును పారాయణ చేసి, శ్రీ సాయిదేవుని అనుగ్రహానికి పాత్రుడై అత్యంత
పవిత్రమైన భగవన్నామస్మరణం చేస్తూ ప్రాణములను వదిలిన విజయానందుడు శ్రీ సాయినాథునిలో ఐక్యం అయిపో యాడు. తన భక్తులకు శ్రీ సాయి ఒక అపూర్వమైన సాధనను ఈ లీల ద్వారా అందించారు. వీలున్నంత వరకూ భగవన్నామస్మర ణ చేస్తూ, సద్గ్రంథ పఠనం గావిస్తూ భగవంతుని చింతనలో వుం టూ మన హృదయాలను పవిత్రం చేసుకోవాలి. అప్పుడు ఆ భగవంతుని కరుణ శీఘ్రమే మనకు లభించి విజయానందుని వ లే సద్గతి మనకు లభిస్తుంది. అతి దుర్లభమైన ఈ మానవ జన్మ లభించినందుకు సార్థకత చేకూరు తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement