శ్రీశైలం, ప్రభన్యూస్: జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడోరోజు వైభవంగా కొనసాగాయి. మహాశివరాత్రిని పుర స్కరించుకొని నవహ్నిక దీక్షతో పదకొండు రోజులపాటు విశేష పూజలు నిర్వహిం చనున్నారు. అందులో భాగంగా గురువారం యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలో భాగం గా గురువారం సాయంకాలం శ్రీ భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను హంసవాహనంపై వెం జేబు చేయించి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎస్.లవన్న అర్చక పరిచారిక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
అనంతరం ఆల య ప్రధాన రాజగోపురంలోని స్వామి అమ్మవార్ల ఉత్తవ మూర్తులను రథశాల వద్దకు చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించి నారికేళలను హారతులను సమర్పించారు. అనంతరం భక్తుల జయజయ ధ్వనుల నడుమ గ్రామోత్సవం ముందుకు సాగింది. ఈ గ్రామోత్సవంలో కోలాటం చెక్కభజన జానపద పగటి వేషాలు బుట్ట బొమ్మలు తప్పెట చిందులు. బీరప్ప డోలు రాజభటు-లు వేషాలు శంఖం తదితర కళా రూపాలు ఆకర్శనగా నిలిచాయి.
నేడు మయూర వాహన సేవ
శుక్రవారం భ్రమరాంబ దేవి మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మయూర వాహనం సేవ నిర్వహిస్తున్నట్టు- దేవస్థానం కార్యనిర్వ హణ అధికారి తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. క్షేత్ర పరిధిలో పాద యాత్రీకులు, శివస్వాములు ఇబ్బందులు పడకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
హంసవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైల మల్లన్న
Advertisement
తాజా వార్తలు
Advertisement