Sunday, September 22, 2024

భక్తురాలిని బ్రతికించిన శ్రీసాయి!

శ్రీసాయికి నిష్కల్మష భక్తురాలైన మాలంబా యికి క్షయ రోగం వచ్చింది. బొంబాయిలో ప్రసిద్ధు లైన వైద్యులెందరినో సంప్రదించి చికిత్స చేయించు కుంది. కాని ఫలితం కనబడలేదు. ఛివరకు శ్రీ సాయి ని శరణు వేడేందుకు ఆమె శిరిడీ వచ్చింది. అప్పటికే ఆమె రోగం బాగా ముదిరిపోయింది. దగ్గు తెరలుతె రలుగా వస్తూ రక్తం వాంతి చేసుకోసాగింది. శ్రీ సా యినాథులను తనకు వ్యాధి నివారించమని ప్రార్ధిం చగా ఆయన ఆశీర్వదించి కేవలం నీరు మాత్రమే త్రాగమని, నేలపై దుప్పటి మాత్రమే పరచుకొని ప డుకోమని సూచనలిచ్చారు. శిరిడీకి వచ్చిన తర్వాత రోగం మరింత ముదిరి వారం రోజులలోనే ఆమె మరణించింది అంతకు ముందురోజు చావడిలో నిదురించిన శ్రీ సాయి ఉదయం బారెడు పొద్దెక్కినా బయటకు రాలేదు. మరొకపక్క మాలంబాయి పార్థి వ శరీరానికి అంత్యక్రియలు కోసం ఏర్పాట్లు జరుగు తున్నాయి. అందరిలోనూ ఆందోళన, విచారం. శ్రీ సాయి చావడి వదిలి బయటకు రాలేదు.
ఆమె శరీరాన్ని దహన వాటికకు తీసుకుపో తుండగా ఆశ్చర్యంగా ఆమె శరీరంలో కదలికలు ప్రా రంభం అయ్యాయి. కొద్ది క్షణాలలోనే ఆమెకు ప్రా ణం వచ్చి లేచి కూర్చుంది. ఈ సంఘటనను ఆనాడు స్వయంగా చూసిన పుణ్యాత్ములు ఎందరో. ”ఏమ య్యిందని ఆవిడను అడుగగా నేను నిద్రలో వుండగా ఎవరో నల్లని వ్యక్తి వచ్చి నన్ను ఎత్తుకుపోసాగాడు. సాయి నన్ను రక్షించు అని నేను ప్రాణ భయంతో కేకలు పెట్టగా శ్రీ సాయి ఆవేశంగా తిడుతూ వచ్చి, త న సట్కాతో ఆ నల్లని వ్యక్తిని బెదిరించి నన్ను విడిపిం చుకొని తీసుకువచ్చారు. ఆ తర్వాత నిద్ర నుండి నాకే మెలకువ వచ్చింది.” అని తన అనుభవాన్ని అందరి కీ వివరించి చెప్పింది.
ఆ తర్వాత తన చుట్టూ జరుగుతున్న ఏర్పాట్ల ను చూసి తాను మరణించి తిరిగి బ్రతికానని తెలుసు కున్న ఆమె సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యింది. ఇం తలో కొందరు భక్తులు పరిగెత్తుకు వచ్చి కొద్దిసేపటి క్రితం శ్రీ సాయి ఎవరినో ఆవేశంతో తిడుతూ, సట్కా తో బెదిరిస్తూ చావడి నుండి బయటకు వచ్చి మశీదు వైపుకు దూసుకువెళ్ళారని చెప్పారు. దాంతో మా లంబాయిని మృత్యువు నుండి రక్షించినది శ్రీ సాయి యే అని అందరికీ అవగతమై అందరూ ఆనందాశ్చ ర్యాలకు గురయ్యారు. వెనువెంటనే తేరుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ సాయినాథులకు శత సహస్రకోటి కృత జ్ఞతాభివందనములను తెలియజేసుకున్నారు. ఈ లీలను జాగ్రత్తగా అర్ధంచేసుకున్నవారికి శ్రీ సాయి నాథులు ఎంతటి మహమాన్వితులైన సద్గురువో, భక్తుల సంరక్షణ పట్ల ఎంతటి అప్రమత్తతో ఉంటారో అవగతమౌతుంది.
తనను శరణు వేడిన భక్తురాలిని ఆశీర్వదించా రు శ్రీ సాయి. శ్రీ సాయి వాక్కు బ్రహ్మ వాక్కుతో సమానం. బ్రహ్మాస్త్రం వలె దానికి ఇక తిరుగులేదు. మృత్యువు ఒక నల్లని వ్యక్తి రూపంలో మాలంబాయి ని కబళించగా, పరిశుద్ధ పరమేశ్వర అవతారం అయిన శ్రీ సాయినాథులు బ్రహ్మ యొక్క లలాట లిఖితాన్ని తిరగరాసి, వచ్చే జన్మ నుండి కొంత ఆయువును ఈ జన్మకు రాసి, ఆ భక్తురాలికి తన అభ య హస్తం అందించారు. మృత్యువును తరిమేసి, ఆమెకు తిరిగి పునర్జన్మ ప్రసాదించారు. శ్రీసాయిని సంపూర్ణంగా శరణు వేడిన వారు మృత్యువునే కాదు. దేనికీ భయపడనవసరం లేదని ఈ లీల మనకు సుస్పష్టంగా తెలి యజేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement