Thursday, November 21, 2024

శ్రీసాయి లీలామృతం

”నీ సర్వ బాధ్యతలూ నావే” తనను దర్శించిన దామూ అన్నాకు శ్రీ సాయినాథులు ఎన్నో సందర్భాలలో పైవిధంగా అభయం ఇచ్చి రక్షించారు. దామూ అన్నాకు ఎంతో కాలంగా సంతా నం లేదు. గ్రహ స్థితి ప్రకారం అతనికి ఇక ఈ జన్మలో సంతానం కలిగే యోగం లేకపోయినప్పటికీ తనను శరణు జొచ్చిన వెంటనే అతని చేత సత్కర్మలను ఆచరిం పజేసి, పాప ప్రక్షాళన గావించి వరుసగా ఎనిమిది మంది సంతానాన్ని ప్రసాదించి అతనిని పున్నామ నరకం నుండి తప్పింపజేసారు. మొదటి ఇద్దరు బిడ్డలకు దౌలత్‌ షా, తానాషా అని పేర్లు పెట్టమని శ్రీ సాయి దామూ అన్నాకు సూచించారు. వాటిని దామూ అన్నా తన డైరీలో రాసుకున్నాడు గానీ ఆ డైరీని ఎక్కడో పెట్టి మరిచిపోయాడు. కొడుకు పుట్టిన తర్వాత దామూ ఆ బిడ్డను శ్రీ సాయి పాదాల చెంత నుంచి ”వీడికి ఏ పేరు పెట్ట మంటారు బాబా” అని అడిగినప్పుడు బాబా ”దామ్యా, నేను ఈ విషయం ఇంతకు ముందే చెప్పాను. వాటిని నువ్వు నీ డైరీలో మూడో పేజీలో రాసుకున్నావు కూడా. తర్వాత ఆ డైరీని అటక మీద వున్న పాత గోతాంలో పడేసావు. సరే, వీడికి దౌలత్‌ షా అని పేరు పెట్టు” అని అన్నారు. శ్రీ సాయి సర్వజ్ఞతకు దామూ అన్నా ఆశ్చర్యపోయి అలాగే చేసాడు. మరొక సంవత్సరం పూర్తికాగానీ అతనికి రెండో సంతానం కలుగగా ఆ బిడ్డకు బాబా చెప్పినట్లు గానే తానాషా అన్న పేరు పెట్టాడు.
దౌలత్‌ షాకు అయిదేళ్ళ వయసులో అక్షరాభ్యాసం కోసం దామూ అతనిని శిరిడీకి తీసుకువెళితే శ్రీ సాయి ఆ బిడ్డ చెయ్యి పట్టుకొని ”హరి” అనే పదం రాయించారు. తర్వాత దౌలత్‌ షా నానా సాహబ్‌ రాసనేగా పేరు మార్చుకొని విద్యాధికుడైనాడు.
నానాసాహబ్‌ రాసనేకు యుక్త వయస్సు వచ్చేసరికి అతనికి ఎన్నో వందల సంబంధాలు వచ్చాయి. వాటిలో అధిక శాతం బా గా డబ్బున్న వారివి కాగా ఒక్క సంబంధం మాత్రం పండరి పురానికి చెందిన ఒక పేద బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చిం ది. అందరూ ఎన్నో కట్నకానుకలు ఇస్తామని ఆశపెట్టారు. నానా సాహబ్‌ రాసానే మామ అయితే మూడు వేల రూపాయలు రొక్కం, ఇల్లు, భూమి కూడా ఇస్తానని చెప్పాడు.
దామూ అన్నా వచ్చిన సంబంధాల తాలూకు జాతకాల న్నింటినీ తీసుకుపోయి సాయి ముందు వుంచి తన కొడుకుకు తగిన సంబంధం ఎంపిక చెయ్యమని అర్ధించగా, సాయి వాట న్నిటినీ పరిశీలించి పండరీపురం సంబంధాన్నే ఖాయం చెయ్య మని సలహా ఇచ్చారు. ఆ సంబంధం వారు ఆర్ధిక ఇబ్బందుల దృ ష్ట్యా ఒక్క పైస కూడా కట్నం ఇచ్చుకోలేమని తెగేసి చెప్పినా, మం చి మంచి సంబంధాలను వదులుకోవద్దని బంధు మిత్ర గణం హచ్చరించినా దామూ అన్నా వాటిని లక్ష్యపెట్టక కేవలం సాయి చెప్పారనే పండరీపురానికి చెందిన బీద బ్రా#హ్మణ సంబంధం నిశ్చ యించి అతి వైభవంగా వివాహం జరిపించాడు. సద్గురువు ఆజ్ఞను మనం మన ఆలోచనలను, అభిప్రాయాలను పక్కన పెట్టి ఈవిధంగా ఆచరించగలమా?
వివాహానికి పండరీపురం వచ్చి నవ వధూవరులను ఆశీర్వదించవలసిందిగా దామూ అన్నా సాయిని ఎంత గానో అభ్యర్ధించాడు కానీ బాబా చిరునవ్వుతో తిరస్క రించి ”నువ్వు నన్నెప్పుడు తలుచుకున్నా నీ ముందు వెంటనే ప్రత్యక్షమౌతాను. నా సలహాలను అడిగిన వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా వున్నాను. నా వైపు ఎవరి దృష్టి కలదో వారి వైపు నేను నా కరుణా కటాక్షాలను ప్రసరిస్తాను. అల్లా అనుమతి లేనిదే నేనెక్కడికీ రాలేను అందుకని నా ప్రతినిధిగా శ్యామాను నీ ఇంట వివాహానికి పంపిస్తాను” అని అన్నారు.
దాము అన్నా బాబా సలహాలను త్రి కరణ శుద్ధిగా ఆచరించి బాబా అనుమ తి మేరకే వివాహం జరిపించినం దు కు నానాసాహబ్‌ వైవాహక జీవి తం మూడు పువ్వులు ఆరు కాయలు గా వర్ధ్దిల్లిందని వేరే చెప్పనవస రం లేదు. సద్గురు నిజమైన భ క్తులకు సంసార జీవితం అతి మధురం.

Advertisement

తాజా వార్తలు

Advertisement