Tuesday, July 2, 2024

శ్రీఫలం- నారికేళం!

కొబ్బరికాయ కొట్టనిదే ఏ పనీ మొదలుకా దు. ఏ పూజా పూర్తికాదు. మన సం స్కృతీ సంప్రదాయాలలో అంతగా మమేకమైన కొబ్బరికాయకు ఆధ్యాత్మిక నేప థ్యం ఉంది. ప్రముఖ కవి కీ.శే. మద్దులపల్లి వేం కట సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పద్యం ఒకటి ఇక్కడ ఉటంకించడం సందర్భోచితంగా ఉంటుంది.
”అకలంకంబగు నారికేళ ఫల పుణ్యంబేమొ?
పై బడ్డ సా
ధక సామాగ్రిని వీడి, ఆత్మ భగవద్దత్తంబు గా
వించి, సా
ర్థకతా లబ్ధికి ఫక్కునన్‌ సెలవివారన్‌ నవ్వుచున్నంతలో /
సిక సన్న్యస్తముగా త్రినేత్రత భజించెన్‌ భక్తి సంసేవ్యతన్‌.”
కొబ్బరికాయ అజ్ఞానము చేత తనను ఆవరించిన అహంకారాది దుర్గుణాలు అనే బా#హ్య ఆవరణమును (పీచును) తొలగించుకొని, నిర్మలమైన ఆత్మను (కొబ్బరి నీటిని) భగవదర్పణము చేసుకొని, తన జన్మ ధన్యమైనదని తెల్లని పలువరుస మెరయునట్లు నవ్వుచుండగా (తెల్లని కొబ్బరి) అంతలో దాని శిఖను (పిలకను) తొలగించి దానిని భగ వంతునికి నివేదన చేస్తారు. (సన్న్యాస దీక్షా స్వీకరణలో శిఖను తొల గించినట్లు). అప్పుడది శివ తత్త్వమును పొందగలిగింది (మూడు కన్నులు కల త్రినేత్రత్వము).
ప్రకృతిలో ‘పండు’గా మారకుండా ఉండే ఒకేఒక ‘కాయ’ కొబ్బరి కాయ. అంతేకాదు. దీర్ఘ కాలము చెడిపోకుండా ఉండడం కూడా దీని ప్రత్యేకత. బ#హుశా అందుకే నిత్య నూతనంగా ఉండాలన్న భావనతో కొబ్బరికాయను క్రొత్త రవికెల గుడ్డలో చుట్టి నూతన గృహాలకు కట్టిస్తా రు పెద్దలు. కొబ్బరి ఆకుల మట్టలతో నూతన గృహాలను, పెళ్ళి పంది ళ్ళను అలంకరిస్తారు.
కొబ్బరి కాయలో పైన ఉన్న పీచును స్థూల శరీరంగా, మధ్యనున్న గట్టి పెంకును సూక్ష్మ శరీరంగా, ఆ లోపలనున్న కొబ్బరి భాగం కారణ శరీరంగా భావించి, కొబ్బరి కాయను అర్పించడం తమను తాము భగ వంతునికి సమర్పించుకున్నట్లుగా భక్తులు భావిస్తారు. కొబ్బరికాయ పగులగొట్టాక లభించే రెండు చిప్పలు జీవాత్మ, పరమాత్మ లకు సంకేతాలు అని, జీవ బ్రహ్మ్యకతకు కొబ్బరికాయ ప్రతీక అని విశ్వసిస్తారు.
కొబ్బరికాయకు మూడు కన్నులు ఉం డడంవల్ల దీనిని ముక్కంటి స్వరూపమని భావిస్తూ, దీనిని ముక్కంటి కాయ, శ్రీఫలం అనికూడా వ్యవ#హరిస్తారు ఆ మూడు కన్ను లను బ్రహ్మ, విష్ణు, మహశ్వర స్థానాలని సం భావిస్తూ కలశం పైన, కొబ్బరి కాయను లక్ష్మీ దేవికి ప్రియమైన తమలపాకుల నడుమ స్థా పించి, ఆవాహన చేస్తారు. పుణ్యాహం మొదలు పెండ్లి వరకు సమస్త శుభకార్యాలలో కలశస్థాపన చేయడం తప్పనిసరి. ఇలా చేయడంవల్ల త్రిమూర్తుల కృపతో కార్యక్రమం సక్రమంగా నెరవేరుతుందని ప్రగాఢ విశ్వాసం. కొబ్బరికాయకు ఉన్న మూడు కన్నులలో ‘బ్రహ్మ నాడి’ అని పిలువబడే పై భాగంలోని కంటినుండి మాత్రమే నీరు బయటకు వ స్తుంది. బ్ర#హ్మనాడి ద్వారానే జీవుడు భగవంతుని చేరుకోగలుగుతా డనే విషయానికి ఇది సంకేతం.
కొబ్బరి నీరు దైవాభిషేకానికి శ్రేష్ఠం. ఎందుకంటే ఈ సృష్టిలో ఎటు వంటి మలినమూ అంటని పరిశుద్ధమైన, అమృతతుల్యమైన, ఆరోగ్య ప్రదమైన జలము కొబ్బరినీరు మాత్రమే కనుక. తల్లి పాలలో మాత్రమే లభించే ‘లారిక్‌ ఆవ్లుం’ టెంకాయ నీటిలో ఉంటుంది. దైవాభిషేకానం తరం తీర్థంగా స్వీకరించే కొబ్బరి నీటివల్ల మనకు రోగ నిరోధక శక్తి, ఆరోగ్యమూ వృద్ధి పొందుతాయి. ఒక కొబ్బరి బొండాం నీరు త్రాగితే ఒక సెలైన్‌ బాటిల్‌ నుండి పొందగలిగే శక్తి మన శరీరానికి లభిస్తుంది. పచ్చి కొబ్బరిని, ఎండు కొబ్బరిని, మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, అందులోనూ కేరళలో, విరివిగా వం టలలో ఉపయోగిస్తారు. కొబ్బరి నూనెను వంటలకు, చర్మ, కేశ పరిరక్షణకు, సౌంద ర్య సాధనాలలోనూ వాడు తారు. కొబ్బరి చిప్పలను ఎండించి, వర్షాకాలంలో వంట చెర కుగా ఉపయోగించే వారని శ్రీకృష్ణ దేవరాయల వారి ”ఆముక్త మాల్యద” కావ్యం చెబుతోంది.
కొబ్బరి కాయను తన పుత్రుడయిన బాల గణపతి కోసం… అత డు బంతి ఆట ఆడుకోడానికి పరమేశ్వరుడు సృష్టించాడని; ఇది విశ్వామిత్రుని సృష్టి అని; లక్ష్మీ స్వరూపమైన ఈ కల్పవృక్షాన్ని శ్రీ మహావిష్ణువు భూలోకానికి తీసుకొనివచ్చాడని వివిధ రకా లైన కథనాలు జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి.
అపర లక్ష్మీదేవి రూపం కనుకనే కన్యాదాన సమ యంలో నవ వధువు దోసిట కొబ్బరి కాయను (బోం డాంను) ఉంచుతారు. అత్తవారింట వధువు గృ#హ ప్రవేశం చేసే సందర్భంలో కూడా నూతన వధూ వరులు కొబ్బరికాయలను చేతులలో ఉంచు కొనే ప్రవేశిస్తారు. ఏడాది పొడవునా అందు బాటులో ఉండే నారికేళ ఫలాన్ని దైవాని కి సమర్పించడం శ్రేయోదాయకం, సత్ఫ లదాయకమూ కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement