Friday, November 22, 2024

శ్రీనివాసుడి పెళ్లి విందు…

స్వా మివారి కల్యాణం ఏర్పాట్ల గురించి చది వితే కలియుగంలో మధ్య తరగతి కుటుం బాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది. స్వామి కల్యాణానికి కుబేరుడు నుండి అప్పు దొరికింది. పెళ్లి సరుకులన్నీ తెచ్చారు. అన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా? విందు ఘనంగా వుండాలి. ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రా హ్మణుడు ఎక్కడ దొరుకుతాడు? అనుకున్నారు.
స్వామి అగ్నిహోత్రుని వంక చూసారు. ”నేను చేస్తాను స్వామి! కానీ వంటపాత్ర సామానులేవి?” అన్నాడు అగ్ని దేవుడు.
”వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి” అంటాడు శ్రీనివాసుడు.
నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వంద ల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండమంతా దిగివస్తుం ది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండ డానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.
”పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసే యండి. కింద నేను పులుసు చేస్తాను” అన్నాడు అగ్ని హోత్రుడు.
స్వామి పుష్కరిణిలో ఏ అన్నం, పాపనా శనంలో ఏ పప్పు, ఆకాశగంగలో ఏ బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో ఏ కూరలు, తుంబుర తీర్ధంలో ఏ పులి హోర, కుమారతీర్ధంలో ఏ భక్ష్యాలు (బూరెలు, పూ ర్ణాలు, బొబ్బట్లు వంటివి.) పాండుతీర్ధంలో ఏ పులు సు, ఇతర తీర్ధాల్లో ఏ లేహ్యాలు మొదలైనవి తయారు చేయాలో స్వయంగా శ్రీనివాసుడే అగ్ని దేవుడిని ఆజ్ఞా పిస్తాడు. అలాగే ఒక్కో తీర్ధంలో/ సరోవరంలో ఒక్కో వంటకం చేస్తారు. పప్పులు, పులుసులు, చక్కెర పొం గళ్లు, కట్టు పొంగళ్లు, జీలకర్ర పొంగ ళ్లు, ఎన్నో రకాల పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేసారు. వంట త యారైంది. వడ్డన చేయాలి పెళ్ళికి వచ్చినవారిని అం దరినీ కూర్చోమన్నారు. భోజనాల బంతులు వేంకటా చలం నుండి శ్రీశైలం వరకు వేశారు.
భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. ”నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.” అన్నాడు బ్రహ్మ.
”నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు” అంటాడు స్వామి.
”నివేదన చేయని పదార్ధాలను ఎవరూ ముట్టు కోరు. నివేదన ఎవరికి చేయాలి?” అంటాడు బ్రహ్మ.
”ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి” అంటాడు శ్రీని వాసుడు. సాక్షాత్తు

హ్మ అహోబల నరసింహ స్వామికి నివేదన చేస్తారు.
అతిధులందరినీ చక్కగా కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యా ము నుంచి దక్షిణగా కొద్ది దూరంలో ఉంది. (ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకుల ను) వేసారు. అందరూ ఆశీనులయ్యాక అందరికి ఒకే సారి వడ్డించారు.
భోజనాలు వడ్డన

ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధి కి కొంత నెయ్యి వేసి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, ”అందరిని ఉన్నంత లో ఏర్పాట్లు చేసాను, లో టు పాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి” అని వేడుకున్నాడు.
అందరూ భోజనాలు చేసి, బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు. అందరినీ ‘భోజనమైందా’ అని పేరు పేరునా అడిగిన తరువాత అందరికి దక్షిణ తాంబూ లాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం. ఆ తరువాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషు డు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు ముగిసే సరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది. రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝా మునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement