Friday, November 22, 2024

AP: దేవీచౌక్ అమ్మోరి భక్తులకోసం శ్రీనివాస్ సౌభాగ్య…

హైద‌రాబాద్ : పరమవరేణ్యురాలైన కనకదుర్గమ్మకు కమనీయంగా, రమణీయంగా జరిగే శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాల పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం దేవీచౌక్ అమ్మవారిని ఈ దసరా ఉత్సవాల్లో దర్శించుకునే, అర్చించుకునే వేలకొలది భక్తులకు ఈసారి ఒక అపురూప పవిత్రకానుకను సమర్పించబోతున్నారు. అరిష్ట శక్తుల మీద విజయంగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ రచనా సంకలనంగా అద్భుతంగా రూపొందించిన సౌభాగ్య వర్ణమయ గ్రంధం ఈసారి భక్తజన సందోహాన్ని తన్మయిమ్ప జేయబోతోంది. అమ్మవారి అనుగ్రహంతో అందరినీ సమృద్ధం చేయడానికి సాధకుల నుండి సామాన్యులవరకూ ఆకట్టుకునేలా నాణ్యతా ప్రమాణాలతో ముద్రించబడిన ఈ సౌభాగ్య మంగళమయ గ్రంధంలో సుమారు ఇరవైఐదు పవిత్రఅంశాలు చోటు చేసుకోవడం విశేషం.

గత నాలుగు సంవత్సరాలుగా బెజవాడ కనకదుర్గమ్మకు ప్రతీ శ్రీ దుర్గానవరాత్రోత్సవాల సందర్భంగా ఒక పవిత్ర ప్రత్యేక గ్రంధాన్ని అందిస్తున్న జ్ఞానమహాయజ్ఞ కేంద్రం సంస్థ ఈ సంవత్సరం ప్రత్యేకంగా దేవీచౌక్ ఉత్సవాలకు ఈ మంత్ర సంపదను సిద్ధం చేయడంతో అర్చక పండితుల అభినందలు వెల్లువెత్తుతున్నాయి. భక్త కోటికి ఉచితంగా అందించే ఈ మహత్వ శక్తుల సౌభాగ్య గ్రంధాన్ని ఉత్సవాల తొలిరోజైన గురువారం పాడ్యమి సందర్భంగా దేవీచౌక్ ఉత్సవ కమిటి అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు ఉత్సవ ప్రధాన పురోహితులు దొంతంశెట్టి కాళహస్తికి అందజేస్తారు. దశాబ్దాలుగా కోస్తాజిల్లాల్లో అత్యంత వైభవంగా, పరమ ప్రతిష్టాకరంగా జరిగే దేవీచౌక్ శ్రీ దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో ఈసారి ముత్తయిదువులకు కుంకుమార్చనల్లో ఈ సౌభాగ్య గ్రంధాన్ని ఉచితంగా అందజేస్తారు.

శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయ ట్రస్ట్ చైర్మన్ తోటసుబ్బారావు, స్టాండర్డ్ ఎలెక్ట్రానిక్స్ డైరెక్టర్ చెన్నాప్రగడ శ్రీనివాస్ ఈ సౌభాగ్య గ్రంధానికి సమర్పకులుగా వ్యవహరించడాన్ని భక్త కోటి హర్షిస్తోంది. శ్రీమాలిక, శ్రీపూర్ణిమ, మహాసౌందర్యం, యుగే యుగే, మహా మంత్రస్య … వంటి ఎన్నో మహాద్భుత గ్రంధసంపదతో గోదావరిజిల్లాల ఘనకీర్తిని దేశదేశాల తెలుగు వారి హృదయాలపై జయకేతంగా ఎగురవేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప అద్భుత సంకలనం కావడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుందని విజ్ఞులు అభినందనలు వర్షిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement