Tuesday, November 26, 2024

ఆదిశంకర విరచిత శ్రీలక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రము

మకుటము:
ఓయి నరసింహ నాకు చేయూతనీవె.

1. పాలసంద్రమెయిల్లుగ బాణిజక్ర
మాదిశేషుని మణికాంతి నతిశయించు
యోగిశరణా! భవమను నుదధినావ!
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె.

2. నలువ, శివుడు, దినమణి, వినతిని మ్రొక్క
వారిసు కిరీట కాంతి పాదాలు వెలుగ
లచ్చి చన్నుల కొలనులో రాజహంస
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె.

3. నన్ను సంసారమను మంటలన్ని దిశల
కాల్చుచున్నవి ననువేగ కావుమయ్య
నీదు చల్లని చరణాల సేదదీర
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె

4. చిక్కి సంసారమనువలను చేపతీరు
ఇంద్రియంబులగాలాన నీల్గుచుంటి
ఎండె గొంతుక, తలత్రిప్పె, మండె మనసు
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె.

- Advertisement -

5. పడితి సంసారమను దిగుడు బావిలోన
వెతలు పాములవలెను నావెంట పడగ
నీదు చరణాల జేరితి నాదు కొనగ
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె.

6. అకట! సంసారమనునేన్గు ఆగ్రహించి
వేయుచున్నది తొండపువేటు, మరణ
భయము వెంటాడు, నామది బవలురేయి
ఓయి నరసింహ! నాకు చేయూతనీవె.

తెలుగు అనువాదము
పాణ్యం దత్తశర్మ, 9550214912

Advertisement

తాజా వార్తలు

Advertisement