Friday, October 4, 2024

శ్రీకరం… శ్రీ క్షేత్రం రథయాత్ర

”రథేతు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే” అనేది ఆర్యోక్తి. అనగా ”పూరి జగన్నాథుడు వామన రూపంలో రథంలో ఆసీనుడై విహరి స్తున్న దృశ్యాన్ని చూసినవారు జన్మ మృత్యు బంధనా ల నుండి తరిస్తారని” అర్థం.
ఈ వాక్యం వెనుక ఓ అంతరార్ధం కూడా ఉంది. శరీరం మధ్యలో వామన రూపంలో ఉన్న ఆత్మను దర్శిస్తే పునర్జన్మ ఉండదు. నాలు గు దివ్య ధామాలలో పూరి కూడా ఒకటి. ”శ్రీ క్షేత్రమ’ని ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో జగన్నాథుని ఆవి ర్భావం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక కథనాలు ఉన్నా యి. ముఖ్యంగా ప్రతి ఏడు పాత విగ్రహాలను తొలగించి. కొత్త వాటిని ప్రతిష్ట చేస్తారు. పాత వాటిని ఆగమ, జ్యోతిష, గ్రహగతులు లెక్క ప్రకారం ఖననం చేస్తారు. ఈ సందర్భంలో పాత విగ్రహాలలోని జగన్నాథుని నాభి పదం మాత్రం తొలగించి కొత్త విగ్ర హానికి అమర్చుతారని ఓ పురాణ కథనం. దాని ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్నాళ్ళకు ద్వారకకు చేరి చెట్టు కొమ్మపై న విశ్రాంతి తీసుకుంటున్నారు. తామరపు రంగులో ఉన్న ఆయన పాదాన్ని పక్షిగా భావించి ఓ వేటగాడు బాణం సంధించాడు. దానివల న కృష్ణ పరమాత్మ ప్రాణం త్యజించి గోకులానికి వెళ్లిపోయాడు. ఈ విషాద వార్త తెలుసుకున్న అర్జునుడు వెంటనే ద్వారకకు చేరుకున్నాడు. కృష్ణ శరీరానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు. ఆ సమయంలో ఆయన ఒక అంశం గమనించాడు. పరమాత్మ శరీరం మొత్తం దగ్ధమై నా నాభి మాత్రం కాలలేదు. అర్జునుడు అవశిష్ట భాగాన్ని సముద్రం లో నిక్షిప్తం చేశారు. శ్రీకృష్ణుని దేహత్యాగా నికి కారకుడైన బోయరాజు శబర రాజు ఆ నాభి అంశం సముద్రంలో తేలియాడుతూ వెళ్లడం గమనించి పరిగెత్తుకొని వెళ్లి ద్వార క నుంచి పూరీ క్షేత్రం వరకు అనుసరించా డు. అతని భక్తికి మెచ్చిన పరమాత్మ కలలో కనిపించి ”సము ద్రతీరం నుంచి నన్ను తీసు కువెళ్ళు నాటి నుంచి మీ వంశమైన సబరుల పూజ నేను గ్రహస్తాన”ని ఆదేశించాడు. శబ ర రాజు దైవాజ్ఞ ఆచరించాడు. ఇది ద్వాపర యుగం కథ.
పూరి జగన్నాథుని ఆలయ నిర్మాణం వెనుక అనేక చారిత్రక ఆధ్యాత్మిక కథలున్నాయి. మొదట ఎనిమిదవ శతాబ్దం చివరన ఏలిన గంగ వంశపు రాజు రెండవ మహాశివగుప్త య యాతి కట్టించాడని, తరువాత 12వ శతాబ్దంలో ఇదే వంశానికి చెంది న చోడ గంగ దేవుడు నిర్మించాడని చారిత్రక కథనాలు. స్వామి తన ఉని కిని మహావిష్ణు భక్తుడైన ఇంద్రద్యుమ్నునికి తెలిపి శ్రీ క్షేత్రంలో ఆలయం నిర్మింపచేశాడనే ఆధ్యాత్మిక కథనం ఉంది. దేవాలయం నిర్మాణం అనంతరం నేలమాధవుని రూపంలో నున్న విగ్రహం కోసం తీవ్రమైన అన్వేషణను రాజాజ్ఞ మేరకు బ్రాహ్మణ పుత్రుడైన విద్యాపతి చేస్తుండగా అరణ్యంలో శబర రాజకుమార్తె లలిత ఆయనకు దారి చూపించి, తన ఇంటికి తీసుకువెళ్ళింది. అనంతరం లలితను ఆమె తండ్రి అనుమతితో విద్యాపతి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో విద్యాపతి సభలో రాజు వలన జగన్నాథుని దారువు రూప కొయ్యను సముద్రం నుంచి ఒకరు ఒక ప్రక్కన, మరొకడు మరో ప్రక్కన పట్టుకొని ఒడ్డుకు చేర్చారని కథనం. శబర రాజు బ్రాహ్మణ వంశ విద్యా పతుల భక్తిని కృష్ణ పరమాత్మ స్వీకరించిన విధంగా నేటికి మహా రాజు నుంచి అన్ని కులాల వారు రథయాత్రను ప్రారంభించడం పూరీలో ఆనవాయితీగా వస్తున్నది. ”వస్తున్నాయి.. వస్తున్నాయి… జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని” సమ సమాజపు నిర్మాణ ఆకాంక్షను మహాకవి తెలియజేసాడనిపిస్తుంది. పూరి జగన్నా థుని ఆలయ నిర్మాణం వెనుక అనేక విశేషాలు ఉన్నాయి. వా టి వెనుక భారతీయ ఆధ్యాత్మిక, జ్యోతిష, ఆగమ శాస్త్రాల విజ్ఞానంతో పాటు వైజ్ఞానిక అంశాలు కూడా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఈ ఆలయం చుట్టుపక్కల బడేకృ ష్ణ, రోహణి, స్వర్గధామ్‌, ఇంద్రద్యుమ్న, నరేంద్రల నే పంచతీర్థాలు ఉన్నాయి. వీటిలో తప్పకుండా స్నానమాచరించి దేవదేవుని దర్శించుకుని తరించాలని భక్తులు కోరుకుంటారు. జగ న్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యా త్మికతలోని సమైక్యత సూత్రాన్ని ఆవిష్కరి స్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement