Saturday, November 23, 2024

శ్రీగిరి ముస్తాబు

కర్నూలు, ప్రభ న్యూస్‌ బ్యూరో: శ్రీశైలంకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. తన ఇష్టదైవమైన భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుంటు-న్నారు. ముఖ్యంగా మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఈ నెల 22 నుంచి వచ్చే నెల 4 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి విదితమే.ఈక్రమంలో ఏర్పాట్లలో ఆలయ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దేవస్థానం ప్రధాన కూడళ్లు, వీధులు,ఖాళీ ప్రదేశాల్లో తాత్కాలిక విడిది ఏర్పాటు- చేశారు. ఎక్కడికక్కడ -టె-ంటు- లను ఏర్పాటు- చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. స్వామి, అమ్మవారు ఉభయ ఆలయాల పరిధిలో శివదీక్ష స్వాములకు చంద్రావతి కళ్యాణమండపం నుంచి ఆలయ రాంగోపురం రాజా ప్రత్యేక క్యూలైన్‌ సదుపాయం సిద్ధం చేశారు . అలాగే సర్వదర్శన క్యూలైన్లు ఏర్పాటు- చేశారు . ఉచిత దర్శన క్యూకంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండేందుకు అనువుగా సదుపాయాలు కల్పించారు . ఆలయ మాడవీధుల్లో భక్తులకు ఎండ తీవ్రత కారణంగా కాళ్లు కాలకుండా కూలింగ్‌ పెయింట్‌ మార్గాలు ఏర్పాటు- చేశారు. గంగాధర మండపం వద్ద ఆలయద్వారానికి అలంకరణ ఏర్పాట్లు- సాగుతున్నాయి . ఆలయంలోని వివిధ విభాగాల్లో మరమ్మతులు చేపడుతున్నారు. రద్దీ క్రమబద్ధీకరణకు అవసరమైన బారికేడ్లను సిద్ధం చేస్తున్నారు. క్షేత్ర పరిధిలోని ప్రధాన వీధుల్లో భారీ ఎత్తున బ్రహ్మోత్సవ స్వాగతతోరణాలు (ఆర్బీద్వారాలు ) ఏర్పాటు- చేశారు. ఉభయ ఆలయాలు, ప్రతి ప్రధాన వీధులు , దేవస్థాన వసతి భవనాలను రంగురంగుల విద్యుద్దీపాలంకరణ గావించారు. ఉత్స వాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆయా విభాగాల పరిది లో స్వామి అమ్మవార్ల దర్శనాలు, ఉభయదేవాలయ నిర్వహణపై ముందస్తు చర్యలు తీసుకున్నారు. అలాగే తాగునీరు క్యూలైన్‌ అవసరమైన మరుగుదొడ్లు, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, పార్కింగ్‌, శివదీక్ష శిబిరాల్లో శివస్వాములకు ప్రత్యేక సదుపాయాలు, వైద్యశిబిరాలు, పాతాళగంగలో స్నానఘాట్ల పటిష్టత, బారికేడింగ్‌, స్వామివారి లడ్డూ ప్రసాదం తదితర వాటికి సౌకర్యాలు కల్పించారు. మొత్తంగా మహాశివరాత్రి బ్రహ్మోత్స వాలకు శ్రీశైలం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. క్షేత్ర నలుమూల వివిధ రకాల ఏర్పాట్ల హడావిడి కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎస్‌.లవన్న సదుపాయాల కల్పనపై స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఆలయానికి చెందిన వివిధ విభాగాధికా రులకు సలహాలు, సూచనలు ఇస్తూ తను ముందుండి పనులను, కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.ఈక్రమంలో దేవస్థానం విభాగాల వారీగా ఉత్సవ ఏర్పాట్లకు సంబంధించిన పనులు చకచకసాగుతున్నాయి. దేవస్థాన యంత్రాంగం. సదుపాయాల కల్పనలో తలమునకలై ఉంది. మల్లన్న స్పర్శ దర్శనం ఉత్సవాలకు ముందే కల్పిస్తుంచడంలో ఇప్పటికే శ్రీశైలానికి శివదీక్ష భక్తుల రాక మొదలయింది. ఇరుముడి స్వాములు శ్రీశైలానికి కాలినడకనచేరి మల్లన్నను దర్శించుకుంటు-న్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు-కొని , అన్నదాన మందిరంలో రద్దీకి సరిపడా సదుపాయాలను అధికారులు చేపట్టారు.
మంచినీటి సౌకర్యంపై దృష్టి
బ్రహ్మోత్సవాలకు పాదయాత్రగా తరలొచ్చే శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మంచినీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లను గావిస్తున్నారు. ఈ క్రమంలో లో కృష్ణమ్మ నీటినే పాదచారుల చెంతకు తీసుకు వస్తున్నారు. నల్లమల భీముని కొలను వచ్చే భక్తులకు మంచి నీటిని అందించే క్రమం లో శ్రీశైలం దేవస్థాన అధికారుల ఆదేశాలతో నీటి సరఫరా విభాగం ఆరు వెయ్యి లీటర్ల ట్యాంకర్లను ఏర్పాటు- చేస్తున్నారు . -కై-లాస ద్వారం వద్ద 20 వేల లీటర్ల నిల్వ సామర్థం కలిగిన సీసీ ట్యాంకు నిర్మించారు . శ్రీశైలంలోని నూతన ఫిల్టర్‌ బెడ్‌ వద్ద శుద్ధి చేసిన నీటిని ట్రాక్టర్ల ద్వారా -కై-లాసద్వారం ట్యాంకులో నింపుతారు . అక్కడినుంచి పైపులైను ద్వారా కొండలు , లోయలు కలిగిన మెట్ల మార్గం ద్వారా ఏర్పాటు- చేసిన పైప్‌ లైన్‌, సిం-టె-క్స్‌ ట్యాంకులతో భక్తుల దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టారు.
స్పర్శ దర్శనం తాత్కాలికంగా రద్దు
శ్రీశైలం మహా క్షేత్రంకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఆదివారం కూడా భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. పెరుగుతున్న భక్తులరద్దీనీ దృష్టిలో పెట్టు-కొని జ్యోతిర్ముడి ధరించిన శివదీక్షాస్వాములకు మాత్రమే స్వామివార్ల స్పర్శ దర్శనం కల్పిస్తున్నారు.నిర్దేశిత సమయాలలో మాత్రమే స్పర్శదర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ఈ నెల 21వ తేదీ సోమవారం వరకు మాత్రమే జ్యోతిర్ముడి ధరించిన వారికి స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించినున్నట్లు- ఆలయ అధికారులు వెల్లడిం చారు. ఆ తర్వాత సర్వదర్శనం, విరామ దర్శనం, ఆర్జితసేవా భక్తులకు స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలలో భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 22వ తేది నుంచి మార్చి 4వ తేదీ వరకు భక్తులందరికీ కూడా స్వామివారి అలంకార దర్శనం మాత్రమే అవకా శం ఉంటు-ంది.బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత మార్చి 5వ తేది నుంచి యథా విథి గా స్వామివార్ల స్పర్శదర్శనం కల్పించనున్నట్లు- ఆలయ ఈవో లవన్న వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement