తనను పూజించిన భక్తులను ఎల్లవేళలా కాపా డే దేవుడు ఆంజనేయస్వామి. భయాలు పోయి మానసిక స్థైర్యాన్ని పొందడానికి హనుమంతుడిని పూజించాలంటారు. కానీ సంజీవరాయ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన ఆలయంలో మాత్రం ఆంజనేయుడు అనారోగ్యాలను నయంచేసే ధన్వంతరిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. అదే చిత్తూరు జిల్లా లో కొలువైన అరగొండ వీరాంజనేయస్వామి ఆల యం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇప్పుడు చిత్తూరు జిల్లా తిరుమల, కాళహస్తి, కాణిపాకంలో అత్యంత ముఖ్యమైన ప్రసిద్ధ యాత్రా కేంద్రాలలో ఒకటిగా మారింది. ఈ స్వామి ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి ముఖం ఉత్తరంవైపుకు ఉంటుంది.
పచ్చని కొండల మధ్య కొలువు దీరిన స్వామిని ప్రతిరోజు సుమారు రెండువేలమంది దర్శించుకుం టారు. ప్రతినెలా పౌర్ణమి రోజు సుమారు 20వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు. పౌర్ణమి రోజుల్లో విశేషంగా జరిగే పూజలకు ప్రత్యేకం గా దేశం నలు మూలల నుంచి వచ్చే భక్తులను చూస్తే ఓ జాతరలా అనిపిస్తుంది. భక్తుల అనారోగ్యాలను నయం చేయడమే కాదు, ఏ పని మొదలుపెట్టినా విజ యం చేకూరుతుందన్న అభయమిస్తూ, భక్తులకు దర్శనమిస్తాడు అర్ధగిరి వీరాంజనేయస్వామి. ఇక్క డున్న తీర్థంలోని ఔషధ గుణాలున్న నీటిని తాగితే… అనారోగ్యాలు నయమవుతాయని అంటారు.
స్థలపురాణం
లంకలో ఉన్న సీతమ్మను విడిపించేందుకు శ్రీ రామచంద్రుడు వానర సైన్యంతో కలిసి రావణుడి పైన యుద్ధం ప్రకటిస్తాడు. ఆ సమయంలో రావణు డి కుమారుడైన ఇంద్రజిత్తువల్ల లక్ష్మణుడు మూర్ఛ పోతాడు. అతడిని పరీక్షించిన సుషేనుడు అనే వానర వైద్యుడు లక్ష్మణుడు లేవాలంటే హమాలయ పర్వ తాలకు ఆవల ఉన్న సంజీవని మూలికను తీసుకురా వాలని చెబుతాడు. అలా రామాజ్ఞతో హనుమంతు డు హమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని చేరు కుంటాడు. ఎన్నో రకాల వనమూలికలతో ఉన్న పర్వ తంపైన సంజీవని మూలికను గుర్తించలేక… ఏకంగా ఆ పర్వతాన్నే పెకలించి వాయువేగంతో లంకకు చేరు కుంటాడు. ఆక్రమంలో సంజీవనికొండలోని ఓ భా గం విరిగి ఇక్కడ పడిపోతుంది. అలా పడిపోయిన ప్రదేశమే ఇప్పటి అరగొండ. అందుకే ఈ ప్రాంతా నికి అర్ధగిరి అని పేరు వచ్చిందని భక్తుల విశ్వాసం. సంజీ వని పర్వతంలోని సగ భాగం అరగొండలో విరిగి పడటంతో అందులో ఉన్న సంజీవకరణి, విషల్యక రణి, సంధాన వంటి వనమూలికలు భూమిలో నిక్షి ప్తమయ్యాయంటారు. కొండ విరిగి పడినచోట నుం చి జల ధార ఉబికి రావడం వల్ల సంజీవరాయ తీర్థం ఏర్పడిందని చెబుతారు. పర్వతంలోని వివిధ ప్రాం తాల నుండి వచ్చే ఆ తీర్థంలోని నీటిలో ఔషధాలు, వనమూలికలు మిళితం కావడంవల్ల ఆ నీటికి అనా రోగ్యాలు నయం చేసే శక్తి ఉందని అంటారు. అలాగే ఇక్కడి పర్వతమట్టి అనేక వైద్య లక్షణాలు కలిగివుండ టంతో ఆ మట్టిని శరీరానికి పూసుకుంటే చర్మవ్యాధు లు పోతాయనీ భక్తులు నమ్ముతారు. వేల సంవత్సరా ల తర్వాత కూడా వ్యాధులను నయంచేసే అసాధార ణ శక్తిని ఈ నీరు ఇప్పటికీ కలిగి వుంది.
అందుకే ఈ స్వామిని దర్శించుకునేందుకు రెం డు తెలుగు రాష్ట్రాలతోపాటూ కర్ణాటక, తమిళనాడు నుంచీ భక్తులు వస్తుంటారు. అనారోగ్యాల్ని నయం చేయడమే కాదు, విజయాలు అందించే స్వామిగా నూ ఇక్కడ ఆంజనేయుడ్ని కొలవడానికీ మరో కథా ప్రచారంలో ఉంది. ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరు డు. అందుకే స్వామిని ఉత్తర దిక్కున ప్రతిష్ఠిస్తే, ఉత్తర ముఖంగా వున్న స్వామిని కొలిస్తే సకల ఐశ్వర్యాలూ, విజయాలూ కలుగుతాయనే ఉద్దేశంతో సప్తర్షుల్లో ఒకరైన కశ్యప మహర్షి స్వామి విగ్రహాన్ని సంజీవ రాయ తీర్థం పక్కన ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించిన స్థల పురాణం చెబుతోంది. పౌర్ణమి రోజున చంద్రకిర ణాల ప్రభావం ఇక్కడి తీర్థంలో పడి నీటి మహమ మరింతగా పెరుగుతుందనా,ఆ నీటిని తాగి స్వామి వారిని దర్శించుకుంటే ఆరోగ్యం సొంతమవ ుతుంద నీ భక్తులు ఈ ఆలయానికి తొమ్మిది పౌర్ణమిలు వస్తా రని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ఆ రోజున స్వామికి సుదర్శన హోమం, సాయంత్రం ప్రాకారో త్సవం, ఆకుపూజ, వడమాల సేవతోపాటు ప్రత్యేక అభిషేకాలూ నిర్వహస్తారు.