నాసిక్ జిల్లాలోని మాలేగావ్ అనే పట్టణంలో ఒక డాక్టరు వుండేవాడు. వాని మేనల్లు నికి ఒకసారి ఒక రాచకురుపు లేచింది. తన డాక్టరు పరిజ్ఞానాన్నంతటినీ వుపయో గించి వైద్యం చేసాడు గానీ ఏమాత్రం వుపశమనం కలగలేదు. రోజురోజుకూ ఆ కురుపు యొక్క బాధ తీవ్రతరం కాసాగింది. తనకు తెలిసిన వైద్యులందర్నీ ఈ కురుపు విష యమై డాక్టర్ సంప్రదించాడు కానీ ఏం లాభం లేకపోయింది. దురదృష్టవశాత్తూ ఆ కురుపు సెప్తిఖ్ కావడంతో ఆపరేషన్ చేసి ఆ చెయ్యిని తీసివెయ్యాలని డాక్టర్లు నిర్ణయించారు. ఇటువం టి సమయంలో ఆ పిల్లవాని తల్లిదండ్రులకు ఒక స్నేహతుడు శిరిడీ వెళ్లి శ్రీ సాయినాథులను దర్శించమని ఆయన అనంతమైన కృపా కటాక్షాలతో అనితర సాధ్యమైన రోగాలెన్నో నయం అవుతున్నాయని సలహా ఇచ్చాడు.
సదరు డాక్టరుగారికి సాధువులన్నా, బాబాలన్నా గౌరవం లేదు. ఇవన్నీ నమ్మవద్దని ఎం త చెప్పినా వినకుండా, ఆ పిల్లవాని తల్లిదండ్రులు శిరిడీ తీసుకువెళ్ళి శ్రీ సాయినాథుని దర్శ నం చేసి తమ పిల్లవాడిని బాగు చెయ్యమని కళ్ల నీళ్ళ పర్యంతమై వేడుకున్నారు. దయార్ధ్ర హృదయులు అయిన శ్రీ సాయి వారిని ఓదారుస్తూ, ”ఏమీ కలత చెందవద్దు. ఎవరైతే ఈ మశీదు మెట్లు ఎక్కారో ఇక వారి కష్టాలన్నీ దూరం అవుతాయి. ఈ ఊదీని తీసుకువెళ్ళి ఆ కురుపుపై రాయండి. వారం రోజులలోనే నయమౌతుంది.” ఆని తన ప్రేమామృతమైన చూపులను ఆ పిల్లవాడిపై ప్రసరించి ఆశీర్వదించారు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు బాబా చెప్పి నట్లే చేసారు. విచిత్రాలలో కెల్లా విచిత్రం. శ్రీ సాయి మహమాన్వితమైన విభూదీని రాయడం ప్రారంభించిన నాటి నుండి ఆ కురుపు నెమ్మదించింది. నొప్పి క్రమంగా తగ్గడంతో పాటు ఆ కురుపు కూడా ఎండిపోసాగింది. చివరకు ఏడవ రోజున పూర్తిగా మానిపోయింది. ఒకవైపు ఆపరేషన్ ద్వారా చెయ్యిని పోగొట్టుకుంటానేమోనన్న ఆందోళనతో వున్న ఆ పిల్లవాడు కురుపు నయమవడంతో మశీదుకు వెళ్ళి బాబా వారి కాళ్ళపై పడి కన్నీటితో అభిషేకం చేసాడు. సాయి ఊదీ ప్రసాదాన్ని స్వీకరించి వారందరూ సంతోషంగా తమ గ్రామానికి తిరిగి వెళ్ళారు. మహామ#హులైన డాక్టర్లు నయం చెయ్యలేని ఆ రాచకురుపును సమర్ధ సద్గురువు అయిన శ్రీసాయి నయం చేసారన్న వార్తను తెలుసుకున్న ఆ దాక్టర్ తాను కూడా వెళ్ళి బాబా దర్శనం చేసుకుందామనుకున్నాడు.
కాని మధ్యమార్గంలో మన్మాడు స్టేషనులో కొందరు బాబాకు వ్యతిరేకంగా చెప్పడం వలన మనసు మార్చుకొని తన మిగిలిన శెలవులను గడపడానికి ఆలీబాగ్‌కు ప్రయాణమ య్యాడు. ఆలీబాగ్‌కు చేరిన తర్వాత అతని హృదయవాణి శిరిడీ వెళ్ళమని తీవ్రంగా ప్రేరేపిం చింది. అంతేకాక ఆ రెండు రోజులు కలలో ఒక దివ్య పురుషుని దర్శనం అయ్యి ఇంకనూ నన్ను నమ్మవా అని అంటున్నట్లు అనిపించింది. స్వతహాగా నాస్తిక భావాలు కల ఆ డాక్టర్ బాబాను పరీక్షించదలచి బొంబాయిలో రెండు వారాల నుండి అంతుబట్టని విచిత్రమైన జ్వరముతో బాధపడుతున్న తన రోగికి ఒక రెండు రోజులలో వ్యాధి తగ్గితే తప్పక శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాడు. సాయినాథుని లీలలు చిత్రాతి చిత్రం. మనో నిశ్చయం జరిగినప్పటి నుండి బొంబాయిలో వున్న ఆ రోగికి జ్వరం తగ్గుము ఖం పట్టనారంభించి రెండు రోజులలోనే సామాన్య ఉష్ణోగ్రతకు దిగింది.
ఆ రోగి బంధువులు పట్టలేని ఆనందంతో డాక్టర్‌గారికి ఫోన్ చేసి ఈ విషయం తెలియ పరిచారు. డాక్టర్ జరిగిన అద్భుతానికి అబ్బురపడి వెంటనే శిరిడీ వచ్చి సాయినాథుని దర్శ నం చేసుకున్నాడు. సాయిని దర్శించిన వెంటనే డాక్టర్‌కు ఒక గొప్ప ఆధ్యాత్మికానుభూతి కలి గింది. భక్తులపై సాయికి వున్న అనంతమైన ప్రేమానురాగాలకు ముదమొంది వెంటనే తన నాస్తిక భావాలను పరిత్యజించి సాయిని తన సద్గురువుగా మనో నిశ్చయం చేసుకున్నాడు. నాలుగు రోజుల పాటు శిరిడీలో సాయి సన్నిధిలో వుండి, అక్కడి ఆధ్యాత్మిక రసానుభూతిని తనివితీరా ఆస్వాదించి బాబా వారి ఊదీ ప్రసాదమును, ఆశీర్వచనములను తీసుకొని ఇంటికి వెళ్లాడు. అప్పటినుండి అతని జీవిత విధానమే మారిపోయింది. సాయి బోధలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ నిత్యం సాయి ఆరాధనలో మునిగి తేలుతుండేవాడు. పదిహను రోజులలో గత నాలుగు రోజుల నుండి రాకుండా వూరిస్తున్న ప్రమోషన్ వచ్చింది. హచ్చు జీతంపై బీజాపూర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసారు. భగవంతుని లీలను అర్ధం చేసుకోవడం ఎవరి తరం? మొదట్లో శుద్ధమైన నాస్తికుడు. అతని మేనల్లుని రోగం వలన సాయి దర్శనం అయ్యింది. నాటి నుండి సాయికి కూర్మి భక్తుడు అయ్యాడు.
సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు.
నాస్తికులను ఆస్తికులను చేసిన శ్రీసాయినాథుడు!
Advertisement
తాజా వార్తలు
Advertisement