Friday, November 22, 2024

త్రిమూర్తులకు ప్రతీక ‘శ్రీరామ నామం’

సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం శ్రీ రామనామ జపం. శ్రీరామనామం త్రిమూర్తుల కు ప్రతీక. ”శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే|
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే||”
అంటూ… శ్రీరామనామం విష్ణు సహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. ‘రామ నామాత్పరో మంత్ర: నభూతో న భవిష్యతి’ అని అన్నారు. అంటే, రామనామం కంటే గొప్ప మంత్రంలేదు. భవిష్యత్తులో కూడా ఉండబో దని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. ‘రామ’ నామాన్ని చెబితే గాయత్రీ మంత్రాన్ని చెప్పినట్లే.
శ్రీరామ నామ మహమను తెలియజేసే ఎన్నో ఉదం తాలున్నాయి. వాటిలో ఓ ఉదంతాన్ని శ్రీరామనవమి సందర్భంగా స్మరించుకుందాం. రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నిండుసభలో కొలువైయుండగా నారద మహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాది మహర్షులు విచ్చేశారు. అప్పు డు నారదుడు, సభాసదులందరినీ ఉద్దేశించి, ”సభకు వందనం. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? మీమీ అభిప్రాయాన్ని చెప్పండి” అన్నాడు.
నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు మొదలయ్యాయి. చివరకు నారదుడే తన తుది నిర్ణయా న్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవం తుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడా నికి ముందే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.
అనంతరం నారదుడు, ఆంజనేయునితో, ”హను మా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప” అని చెప్పాడు. అం దుకు హనుమ అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్క రించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్క రించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకు న్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, ”మునీశ్వరా! హనుమ పొగరు చూశారా? సభలో మీకు తప్ప అందరికీ నమస్కరించా డు. మీరు అతన్ని శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతి శయమో చూశారా?” అని చెప్ప డంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వా మిత్రుడు శ్రీరాముని సమీపించి, ”రాజా! నీ సేవకుడైన హనుమ అందరికి నమస్కరించి, నన్ను అవ మానించాడు. రేపు సూర్యుడు అస్తమించేలోగా, అతనికి మరణ దండన విధించాలి” అన్నాడు.
విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాటించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపో యాడు. ఈ విషయం క్షణ కాలం లో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా ఎంతో బాధ కలిగింది. నార ద మునిని సమీపించి ”దేవర్షీ! నన్ను రక్షించండి. ఇప్పు డు నేనేమి చేయాలి?” అని అడిగాడు దేవర్షి, ”బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానంచేసి ”ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ” మంత్రాన్ని జపించ”మన్నాడు

మరునాడు సూర్యోదయానికి పూర్వమే హనుమ సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులు జోడించి భగ వంతుని నామాన్ని జపించసాగా డు. శ్రీరాముడు హనుమంతునికి దూరంలో నిలబడి కరుణార్ద్ర దృష్టి తో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చాపూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షిం పజేయసాగాడు. ఒక్క బాణంకూ డా హనుమంతుని బాధించలేక పోయింది. ఆ రోజంతా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. భయంకర అస్త్రాలను ప్రయోగించాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని తీశా డు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తూ రాముని వైపు చిరునవ్వు తో చూస్తున్నాడు. ఆ స్థితిలో నారద మహర్షి విశ్వామిత్రుని సమీపించి ”ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహ రించుకోండి! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయ లేకపోయాయి. ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షిం చండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!” ఆ మాటలకు విశ్వామిత్ర మహర్షి ప్రభావితుడై పోయాడు. ”రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్ద”ని ఆదేశించాడు. దానితో హనుమం తుడు వచ్చి, తన ప్రభువు చరణాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు ప్రసన్నుడై హను మ అనన్య భక్తిని ప్రశంసించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement