Wednesday, November 20, 2024

శ్రీలంక గుళ్ళు…పచ్చని గూళ్ళు

ఒక సుందర ద్వీపం శ్రీలంక. పచ్చపచ్చని చెట్లు… ఆరోగ్యకరమైన పచ్చని గాలి… ఎటు చూసినా ఆహ్లాదపరిచే అందమైన నీలి ఆకాశం… స్వచ్ఛమైన నీరు. పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే ఈ ద్వీపంలో అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయాలు వున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకులనే కాదు… ప్రకృతి పర్యాటకులను కూడా ఆకర్షించే విధంగా వున్న అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది అయిన శాంకరీదేవి ఆలయం, సీతావాటికల చరిత్రలోకి వెళితే…

ఎంతో మహిమగల అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లో ముందుగా నమస్కరించవ లసినది శాంకరీదేవి శక్తిపీఠం. ప్రపంచవ్యాప్తంగా వున్న శక్తిపీఠాల్లో ఇది మొద టిది. ఈ శక్తిపీఠం పురాణాల్లో సింహళద్వీపం అని పిలవబడే మన పొరుగు దేశం అయిన శ్రీలంకలోని ట్రింకోమలి పట్టణంలో వెలసింది. శాంకరీదేవిని మహర్షులు వన శంకరి అని కూడా పిలిచేవారని పురాణాలు చెబుతున్నాయి. వనం అంటే నీరు, అడవి. శాంకరీదేవి వెలసిన లంక చుట్టూ నీరు, చెట్లే వుంటాయి. ఆదిశంకరాచార్య రాసిన అష్టాదశ (18) శక్తి పీఠాల్లో ఇది ఒకటి. లంకాయం శాంకరీదేవి రక్షేత్‌ ధర్మపరాయణా! ఆదిశంకరాచార్యుల వారు స్వరపరిచిన శ్లోకం ద్వారా లంకలోని శాంకరి మొదటి శక్తి పీఠం. లంకలో వెలసిన శాంకరీదేవి రాక్షస గుణాలను సంహరించి,

ధర్మాన్ని రక్షిస్తూ… భక్తులను కాపాడేది.
తండ్రి దక్షుడు చేస్తున్న యజ్ఞానికి పిలవకుండా వెళ్ళిన సతీదేవి అవమానానికి గురైంది. భర్త అయిన పరమేశ్వరుడిని నిందించడం సహించలేక యోగాగ్నిలో ప్రవేశించి మృతిచెం దింది. సతీ వియోగ దు:ఖం తీరని తన జగద్రక్షణా కార్యాన్ని మానివేసాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో ఆ మృత దేహాన్ని ఖండాలు గా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడి స్థలాలు 18 శక్తిపీఠాలుగా వెలిసాయి. అలా వెలసిందే శాంకరీ దేవి శక్తిపీఠం. మహావిష్ణువు సతీదేవి శరీరాన్ని ఖండిం చినప్పుడు సతీదేవి తొడ భాగం శ్రీలంక ద్వీపంలోని తూర్పు తీర ప్రాంతంలో ట్రింకోమలిపురంలో పడిందని, అక్కడ శాంకరీదేవి ఆలయం కట్టారని పురాణ కథనం. కాగా ప్రస్తుతం ఈ శక్తిపీఠం శిథిలమైపోయిం ది. ఆ ప్రాంతంలో ఒకప్పుడు శక్తిపీఠం ఉం దనడానికి ఆనవాలుగా ఒక స్థంభం మాత్రమే దర్శనం ఇస్తుంది.

ఆలయ చరిత్ర

హిందూ మహాసముద్ర తీరం లో శ్రీలంకలోని ట్రింకోలీ ప్రాంతం లో అందమైన త్రికోణశ్వరం కొండ పైన ప్రకృతి అందాల మధ్య శాంక రీదేవి ఆలయం వుండేది. దీనిని రావణాసురుడు నిర్మించాడు. అమ్మ వారి అనుగ్రహంతో రాజ్యం సుభిక్షంగా వుండేది. ఇది దక్షిణాదిలోని అత్యంత సం పన్నమైన అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయానికి దాదాపు 1000 స్తంభాలు వుం డేవట. త్రికోణం ఆకారంలో వున్న కొండపై రావ ణాసురుడు భక్తికి ముగ్ధుడైన శివుని సూచనల మేరకు త్రికోణశ్వర ఆలయాన్ని అగస్త్య మహర్షి నిర్మించాడు. పల్లవులు, చోళులు, పాండ్యరాజు లు పాల కులుగా శాంకరీ ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసి సంరక్షించారు. ఆ తర్వాత 17 శతాబ్దంలో పోర్చు గీసువారు చేసిన దాడిలో శాంకరీదేవి ఆలయం ధ్వంసమైంది. పోర్చుగీసు ఆక్రమణదారుల నుండి రక్షించడానికి త్రికోణశ్వ ర, శాంకరీదేవి దేవతలను ఒక బావిలో దాచారు. 1948లో శ్రీలంకకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ విగ్రహాలను బయటకు తీశారు. తర్వాత త్రికోణశ్వరుని ఆలయం, శాంకరీదేవి ఆలయాలను నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు.

- Advertisement -

రావణుడు నిర్మించిన బావులు

ట్రింకోమలీకి వెళ్లే దారిలో కన్యయి హాట్‌ స్ప్రింగ్స్‌ వున్నాయి. ఇక్కడ రావణాసురుడు కట్టిన ఏడు బావులు వుంటాయి. ఒక్కొక్క బావిలో ఒక్కొక్క ఉష్ణోగ్రతతో నీరు ఊరుతూ వుం టుంది. ఆ ఏడు బావులలోని నీటితో స్నానం చేస్తే అనారోగ్యాలు నశిస్తాయని, శుభం కలుగు తుందని భక్తుల విశ్వాసం. నేటికీ ఆ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అక్కడ స్నానం చేస్తారు. కనీసం ఆ ఏడు బావులలోని నీటిని తలపై చల్లుకుని కాళ్ళు, ముఖం కడుక్కుంటారు.
అశోక వాటిక… సీతావాటిక

శ్రీలంకలోని ప్రధాన హిల్‌ స్టేషన్‌ అయిన నువారా ఎలియా నగరానికి దగ్గరగా సీతా ఎలియా అని పిలు వబడే ఈ ప్రాంతం వుంది. సింహళ భాషలో ఎలియా అనే పదానికి బహిరంగ స్థలం అని అర్థం. రావణాసు రుడు సీతాదేవిని తీసుకువచ్చి బంధించిన అశోక వాటి క ఇది. అడవి సానువుల్లోని ఈ ప్రదేశంలో రాళ్ల మధ్య నీరు ప్రవహిస్తూ వుంటుంది. ఈ ప్రాంతంలోనే సీత విశ్రమించి, అందమైన అడవి మధ్యలో వున్న ఆ నీటి ప్రవాహంలో స్నానం చేసేదని స్థల కథనం. రామ రావ ణుల యుద్ధం ముగిసేవరకు సీతాదేవి ఈ అశోక వాటి కలోనే వుంది. ఇక్కడ వున్న పురాతన ఆలయాన్ని సీతా యి అమ్మన్‌ దేవాలయం అంటారు. ఇది ప్రపంచం లోని ఏకైక సీతాదేవి ఆలయంగా చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న పెద్ద పాదముద్రలు ఆంజనేయస్వామివని చెబుతారు. సీతాదేవిని వెతుకుతూ వచ్చిన ఆంజనేయస్వామి ఇక్కడ అడుగుపెట్టిన మొదట వేసిన పాదముద్ర ఇది. రామాయణ వచనం ప్రకారం రావణుడు సీతను బందీగా వుంచడానికి అశోక వాటికను ఎంచుకుకోవడానికి కారణం ఈ హిల్‌స్టేషన్‌ అద్భుతమైన వాతావరణం, మంత్రముగ్ధులను చేసే అందంతో వుంటుంది. ఈ ప్రకృతి అందాలతో సీతను ఒప్పించి గెలవాలని రావణుడు ఆశించాడు. వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 61, 62, 63 శ్లోకాలలో అశోకవాటిక గురించి వివరించబడింది.

సీత అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం

శ్రీలంక స్థానిక పురాణం ప్రకారం సీతా ఎలియాకు సమీపంలోని దివురుంపోలాలో సీత అగ్నిప్రవేశం చేసిన ప్రదేశం వుంది. దివురుంపోలా అంటే స్థానిక సింహళ భాషలో ప్రమాణ స్థలం అని అర్థం. ఈ గ్రామంలో సీత అగ్నిపరీక్ష నిర్వహించిన ప్రదేశాన్ని స్మరించుకునే వేదిక వుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ ఈ స్థలంలో చేసే వాగ్దానాలను ప్రజలే కాదు స్థానిక న్యాయవ్యవస్థ కూడా గౌరవిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement