Thursday, September 19, 2024

శ్రీలలిత విష్ణుసహస్ర నామస్తోత్రమ్‌ గ్రంథావిష్కరణ

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రముఖ పారిశ్రామిక వేత్త, కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఫౌండర్‌ చైర్మన్‌ బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్‌ రచనా సంకలనంగా రూపుదిద్దుకున్న ‘శ్రీలలిత విష్ణు సహస్ర నామస్తోత్రమ్‌’గ్రంథాన్ని ఒకేరోజు మూడుచోట్ల ఆవిష్కరించారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళీ సమక్షంలో, హైదరాబాద్‌ కిమ్స్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో, బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఈ పవిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై శ్రీలలిత విష్ణుసహస్ర నామస్తోత్రమ్‌ గ్రంథ విశిష్టతను ఆలయ ఈవో ఎస్‌ రామారావు భక్తులకు వివరించారు.

ఇక ఇదే గ్రంథాన్ని శనివారం సాయంత్రం రాజమహెంద్రవరం శ్రీఉమామార్కండేయస్వామి ఆలయంలో కోస్తాజిల్లాల వర్తక సంఘాల సమాఖ్య పూర్వ కార్యదర్శి, రాజమండ్రి ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మాజీ అధ్యక్షులు అశోక్‌ కుమార్‌ జైన్‌ ఆవిష్కరించారు. శుక్రవారం సాయంత్రం దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంద్రకీలాద్రిపై ఈ మంగళ గ్రంథాన్ని ఆవిష్కరించారు.

అద్భుత గ్రంథాలను భక్తకోటికి ఒక యజ్ఞంలా వితరణ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. ఆలాగే పురాణపండ యజ్ఞకార్యాన్ని కూడా ప్రశంసిం చారు. మహాబలమేదో వీరిద్దరిచేత అద్భుతాలు చేయిస్తోందని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement