Friday, November 22, 2024

శ్రీ చైతన్య మహాప్రభువు బోధామృతము

ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ, పూరీ నుండి గయ పుణ్యక్షేత్రానికి వెడుతూ, జగ న్నాథ్‌ మిశ్రా అనే విప్రుని ఇంటికి అతిథిగా వచ్చాడు. వచ్చిన బ్రాహ్మణుడు వంట చేసుకొని, శ్రీకృష్ణుని పూజించిన తదుపరి, స్వామికి నైవేద్యం సమర్పించాడు. తరువాత ఆ బ్రాహ్మణుడు ధ్యానం లో నిమగ్నమయ్యాడు. ఇంతలో ఆ ఇంటి యజమాని జగన్నాథ్‌ మిశ్రా పుత్రుడు ఆరు లేదా ఏడు సంవత్సరా ల వయస్సున్నవాడు శ్రీకృష్ణ పరమాత్మకు పెట్టిన నైవే ద్యం ఎత్తుకెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్య పోయి, మళ్ళీ అన్నం వండి, శ్రీ కృష్ణ పరమాత్మకు నైవే ద్యం పెట్టి, మరల ధ్యానంలోకి వెళ్లిపోయాడు. మరల ఆ బాలుడు వచ్చి, ఆ నైవేద్యాన్ని తానే స్వీక రించేసాడు. బ్రాహ్మణుడుకు కోపం వచ్చి, తండ్రి మిశ్రాగారికి తెలి పారు. ఆయన నేను పిల్లవాడికి భయం చెపుతాను, మీరు దయచేసి, మళ్ళీ పరమాత్మకు నైవేద్యం సమ ర్పించండి. అని సూచించారు. అపుడు బ్రాహ్మణుడు అలాగే వంట చేసి, నైవేద్యం సమర్పించి, ధ్యానంలోకి వెళ్ళబోతుండగా ఆ బాలుడు రాగానే, పట్టుకొన్నాడు. వెంటనే ఆ బాలుడు శ్రీ కృష్ణుడుగా దర్శన భాగ్యం కలి గించాడు. ఆ విప్రుడు క్షణం ఆ పరమాత్మను వీక్షించి, స్పృహ కోల్పోయాడు. కొంతసేపటికి, తెలివి తెచ్చుకొ ని, ఆనందంతో, జరిగిన సంగతి ఆ బాలుని తండ్రికి చెప్పాడు. అలా శ్రీకృష్ణుడుగా దర్శనమిచ్చిన బాలుడే, ”శ్రీ చైతన్య మహా ప్రభువు”గా గుర్తించబడ్డారు.

జననం – విద్యాభ్యాసం

శ్రీ చైతన్య మహా ప్రభువు శతాబ్ది 1407, ఫాల్గుణ మాసం ఇరవై మూడవ రోజు అంటే, 1486 సం.రం ఫిబ్రవరి నెల 18వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని నది యా జిల్లాలోని మాయాపూర్‌ అనే గ్రామంలో జగన్నా థమిశ్రా, తల్లి శచీదేవి దంపతులకు జన్మించారు. తల్లి తండ్రి అంటే తాత నీలాంబరి చక్రవర్తి అనే ఆయన గొప్ప జ్యోతిష్య శాస్త్రవేత్త. ఆయన తన మనవడి జాత కం చూసి, గొప్ప పురుషుడు కాగలడని చెప్పి ”విశ్వం భరుడు” అనే నామకరణం చేశారు. పిల్లవాడు ఎప్పు డైనా ఏడుస్తుంటే, తల్లి, ఇతరులు ”హరిబోల్‌ హరి బోల్‌” అని చెపుతూంటే ఏడుపు మానేసేవాడు.
వల్లభాచార్యుడుకు చేసిన బోధామృతం సనాతన గోస్వామికి, ప్రకాశానంద భారతివంటి వారికి, ”అచిం త్య భేదాభేదతత్త్వము” అనే సాంఖ్య యోగాన్ని తెలి పారు. దీని ద్వారా భగవంతుడు సృష్టిలో చేరి ఉన్నా డు. అలా అంతర్గతంగా ఉన్నా సృష్టికంటే భిన్నమైన వాడు. భగవంతుని పవిత్ర నామం ఆయన శబ్ద అవతా రమని, ఆయన సంపూర్ణ పరతత్త్వము కనుక, ఆయన పవిత్ర నామానికి, దివ్య స్వరూపానికి భేదమేమీ లేదు అని విశదీకరించారు. శ్రీ కృష్ణ భగవానుని పవిత్ర నా మాన్ని సంకీర్తన చేయడంవల్ల, జీవుడు భగవంతుని తో సాంగత్యం పొందగలడని తెలిపారు. అలా నామ జపం చేసే జీవి మూడు దశలలో ఉన్నతిని అందుకొం టాడు. మొదటి దశ ‘అపరాధ దశ.’ రెండవది శుద్ధి దశ. ఇక మూడవది విశుద్ధ దశ. అపరాధ దశలో వ్యక్తి విషయ భోగాల మీద వ్యామోహం కలిగి ఉంటాడు. రెండవదశలో ప్రాకృత మాలిన్యాల నుండి ముక్తుడు అవుతాడు. మూడవదైన విశుద్ధ దశలో అతనికి కృష్ణ ప్రేమరూపమైన లక్ష్యం సిద్ధిస్తుంది. ఇదే మానవాళికి కావలసిన లక్ష్యం. అని బోధించారు. ఒక వ్యక్తి భావాన్ని అనుసరించి మనసు శ్రీ కృష్ణుడిపై (ఆయన నామ, రూప, గుణ, లీలా, ప్రేమ) లగ్నం చేస్తే ఆ వ్యక్తి కర్మలు స్థూల, సూక్ష్మ రూపంలో ఆ పరమాత్మకు అనుకూలం గా ఉంటాయి అని విశదీకరించారు.
రామానంద రాయలకు పరమతత్త్వం గురించి, కర్మ మీమాంసముల గురించి, బ్రహ్మానుభూతిని గురించి విశదీకరించారు. తన గురువైన ప్రకాశానంద సరస్వతితో ”పవిత్ర భగవన్నామము, కీర్తనముల్లో కలిగిన తన్మయత్వం ప్రామాణికమైందని, సకల వేద శాస్త్రాలు సారం అదే అని, ఒక వ్యక్తి భగవంతుని పట్ల ప్రేమను, ఇతర భక్తుల పట్ల మైత్రిని దీనుల యెడ కరు ణను, నాస్తికుల పట్ల విముఖతను ప్రదర్శించినచో, అతనిని శుద్ధ భక్తులుగా పరిగణించవచ్చును. ప్రతీ జీవిలో పరమాత్మను దర్శించగలుగు తాడు. అంటూ కృష్ణ చైతన్య ఉద్యమం గూర్చి తెలిపేవారు.

చైతన్య మహాప్రభువుగా అవతరించడం

తన 24వ ఏట విశ్వంభరుడు కట్వా పట్టణానికి చెందిన మహాపండితుడు శ్రీ కేశవభారతి వద్ధ సన్యా స దీక్ష పొంది, ఆయన వద్దే, సర్వవేదాలలోని సారాన్ని గ్రహంచిన సందర్భంలో, విశ్వంభరుడు శ్రీకృష్ణ పర మాత్మ సంకీర్తనలో తన్మయం చెందడం చూసి ఆశ్చ ర్యపోయారు. తరచు శ్రీకృష్ణుడు ఆవహంచి ప్రేమత త్త్వాన్ని ప్రభోధించాలని అసంకల్పితంగా హచ్చరిస్తూ ఉండడం చూసి, కేశవ భారతి ఆయన పేరును ”శ్రీ కృష్ణ చైతన్యుడు”గా సంబోధించారు. అప్పటినుండే ఆయన చైతన్య మహాప్రభువుగా పేరు పొందాడు. తీసుకొన్న చైతన్య ప్రభువు పుణ్యక్షేత్రాలు కాశీ, ప్ర యాగ, బృందావనం, పూరీ వంటి ఎన్నో సంద ర్శించి, ప్రజలలో శ్రీ కృష్ణ భక్తితత్త్వాన్ని బోధించారు. అలా తిరుగుతూ శాంతిపూర్‌లోని అద్వైత ప్రభువు ఇంటికి వచ్చారని తెలుసుకొన్న ఆయన తల్లి, భార్య కలిసి, చైత న్య ప్రభువును కలిసారు. ఆయన సన్యాసదీక్ష తీసుకొ న్నందుకు ఇద్దరూ బాధపడ్డారు. అపుడు తల్లితో ”తల్లి! ఈ శరీరం నువ్వు ప్రసాదించినదే. తృణప్రాయమైన ఈ శరీరంపై వ్యామోహం పెంచుకోవడం ధర్మమా? భగవంతుని అనంతమైన లీలా విషయాలను తెలుసు కోవడానికీ జన్మ ఏమాత్రం సరిపోదు. చివరకు అంద రూ ఆ పరమాత్మను శరణాగతి పొందవలసిందే కదా!” అంటూ ధైర్యం చెప్పినా ఆధ్యాత్మిక సాధన సుసంపన్నం అవడానికి, బృందావనం వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి” అని కోరగా, తల్లి నువ్వు బృందావ నం వెళ్ళి, కొద్దికాలం మాత్రమే ఉండి, వచ్చి పూరీలోని జగన్నాథుని సమక్షంలో ఉండు. దీనివల్ల పూరీ మన ఊరికి దగ్గరలో ఉంది. నీ క్షేమం సమా చారం తరచూ తెలుస్తూ ఉంటుంది.” అని చెప్పి అనుమతి ఇచ్చారు.

- Advertisement -

కృష్ణ చైతన్యోద్యమమం

శిష్యులు హరిఠాకూర్‌, నిత్యానందుడుకు ఆజ్ఞ గా, ఈ పట్టణం పరిసర ప్రాంతాల్లో ప్రతీ వీధికి, ప్రతీ ఇంటికి వెళ్ళి హరినామ సంకీర్తన చేయమని, దాని విశేషాలు బోధించమని చెప్పి పంపారు. కృష్ణ భగవా నుని నామం, లీలలు, ప్రేమల ప్రచారం ద్వారా ప్రజల్లో కృష్ణ భక్తిని పెంపొందించుటయే ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఉద్యమం ద్వారా మానవసమాజాన్ని ఆధ్యా త్మిక వనంలో జీవితమనే పుష్పాలు పరమాత్మ పూజకు అంకితమవ్వడమే దీని లక్ష్యం. ”మనం సాధారణంగా చెప్పుకొనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ హరే రామ – రామ రామ #హరే హరే. ఈ 32 అక్షరాల మంత్రాన్ని ప్రజలకు అందించిన మహనీయుడు శ్రీ చైతన్య మహా ప్రభువు. ”కాళీశాంతారణ” అనే ఉపనిష త్తులో నుండి గ్రహంచి, విస్తృత ప్రచారం చేసారు. ఈ హరేకృష్ణ నామం చాలా బలమైంది. పవిత్రమైంది. ‘హరే’ అంటే ఓ! భగవానుడి పరమశక్తీ!” అని కృష్ణా అంటే దేవాది దేవా! అని. ఈ పవిత్ర మంత్రం దీక్షగా జపిస్తే ముక్తిదాయకం. ఇస్కాన్‌ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభు వేదాంతస్వామి ఈ చైతన్య మహా ప్రభువు శిష్యు లే. ఇస్కాన్‌ స్థాపించక ముందే కృష్ణ పరమాత్మ తత్త్వం ప్రచారంచేసి, కృష్ణ తత్త్వాన్ని బోధించారు.

పరమ సిద్ధి పొందుట

1534 సం .రం. జూన్‌ 14 వతేదీన పూరీలోని జగ న్నాథస్వామికి పూజలు చేసే నిమిత్తం గర్భాలయంలోకి వెళ్ళి, పరమాత్మలోనే ఐక్యం చెందినట్లుగా పెద్దలు చెపుతారు. ఏదిఏమైనా చైతన్య మహా ప్రభువు కృష్ణ భక్తిని ప్రబోధించారు. ఆయన బోధనలు చదవడం అమృతం తాగినంత మధురంగా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement