Tuesday, November 26, 2024

శ్రీదత్త వైభవం

”దత్తాత్రేయ మహాత్మానం వరద భక్త వత్సలం,
ప్రపన్నార్తి హరం దేవం వందే స్మర్తగామి మనోవతు!”
ఈరోజు దత్త జయంతి. మార్గశిర పౌర్ణమి ఆయన జన్మించిన రోజు. భాగవతంలో విష్ణావతారాలలో ఆరవ అవతా రం దత్తాత్రేయుడిదేనని చెప్పబడింది. అన్నిఅవతారాలకు ముగింపు ఉంది. కానీ ఈ దత్తావతారానికి ముగింపులేదు.
ఈయనను దత్తుడు అని అంటారు. దత్తుడు అంటే దత్తమైన వాడు. అని అర్థం. ఈయన త్రిముఖాలతో, ఆరు చేతులతో, వెనుక కామధేనువు, ఔదుబర వృక్షం, ముందు నాలుగు కుక్కలతో, విరాజిల్లుతున్న పరమాత్మ స్వరూపం. అంతరార్థం ఏమిటంటే నాలుగు కుక్కలు నాలుగు వేదాలు, కోర్కెలు తీర్చుటకు, ధర్మా నికి కామధేనువు, ఔదుంబర వృక్షం విశ్వశాంతికి చిహ్నాలు. ఇతి హాసాలైన రామాయణ, మహాభారతం, భాగవతం గ్రంథాలలో దత్తాత్రేయుని గూర్చి కనపడుతుంది.
దత్తాత్రేయుడు తనకు ఉపనయనం అయిన పిమ్మట, తం డ్రి అత్రి మహర్షి వద్దే వేద, బ్రహ్మ, విద్యల వంటివి నేర్చుకొన్నా డు. బ్ర#హ్మ వద్ద ఆత్మ విద్య, వేద విద్య నేర్చుకొన్నా, ఇంకా పరమ సత్యం కోసం అన్వేషిస్తూ, దేశమంతా తిరుగుతూ, చివరకు ఉత్త ర కర్ణాటకలోని కనకపుర అనేచోట జ్ఞానోదయమయ్యింది. భార తీయ ఆధ్యాత్మిక చింతనలో అత్యున్నతమైన గురువుగా, దేవుని గా కొనియాడబడుతున్నాడు. గౌతమీ నది ఒడ్డున శివుని గూర్చి ఘోర తపస్సు చేసి, శివుని ద్వారా శాశ్వత బ్రహ్మ జ్ఞానం పొందా డని పురాణాలు చెపుతున్నాయి. కార్తవీర్యార్జునకు ఆత్మ విద్య, వశిష్టునకు యోగవిద్య, ప్రహ్లాదుడుకు మంత్రవిద్య, ఆత్మవిద్య ఇలా ఎంతోమందికి జ్ఞానాన్ని అందించారు. దత్తాత్రేయ రూపం లో పరమార్థం దాగి ఉంది. త్రిగుణాలైన తమో గుణం, రజో గుణం, సత్త్వ గుణాలకు అతీతుడుగా, పరమేశ్వర తత్త్వగుణాన్నే అలవర్చుకొన్నాడని. త్రిమూర్తుల అంశతో జన్మించిన వాడుగా, భూత, భవిష్యత్‌, వర్తమానములకు చిహ్నంగా అభివర్ణించారు.
రోజులో దత్తాత్రేయుడు ఆసేతు హిమాచలం చుట్టివస్తారని పురాణం తెలియచేస్తోంది. అంటే ఆయన ఉదయం కాశీలోని
గంగలో స్నానం చేసి, ధ్యానానికి గాణుగాపురం చేరి, కొల్హాపూర్‌లో భిక్షాటన చేసి, పండరీపురంలో విఠలుని దర్శించి తిలక ధారణ చేసి, గోకర్ణంలో సంధ్యావందనం చేసి, పాంచలేశ్వర్‌లో సాయం త్రం భిక్ష స్వీకరించి, బదరీలో పురాణ శ్రవణం చేసి విశ్రమిస్తారని ప్రతీతి. దత్తుడు ముక్తి ప్రదాత. దత్తాత్రేయుడుని ”అనఘుడు” అంటారు. అనఘ అంటే పాపంలేనివాడని అర్థం. సర్వ మాన వాళికి అవసరమైన సనాతన ధర్మాన్ని నిలబెట్టి, చైతన్యవంతు లుగా ప్రజలను తీర్చిదిద్దడానికి దత్తాత్రేయ పదహారు అవతారా లు ధరించాడు. వాటిలో ముఖ్యమైనవి శ్రీపాద వల్లభులు శ్రీ నృసిం#హ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, షిరిడివాసి శ్రీ సాయినాథుడు, శ్రీ వాసు దేవానంద సరస్వతి, శ్రీ గజానన మహారాజ్‌, శ్రీ #హజరత్‌ తాజు ద్దీన్‌ బాబా, సిద్దేశ్వర్‌ సంత్‌ గులాబ్‌ బాబా, స్వామి శివానంద మహారాజ్‌. ఇప్పటికీ భక్తులు వారిని ఆరాధిస్తూ దత్త తత్త్వాన్ని అనుసరిస్తున్నారు.
దత్తాత్రేయ జననం గురించి పురాణాలలో రెండు కారణా లు కనపడుతున్నాయి. నారద మహర్షి వల్ల అనసూయ ప్రాతి వత్యం గురించి విన్న లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ ”ఏమిటి! మన కంటే గొప్ప పతివ్రతురాలా? అయితే పరీక్షించవలసిందే” అని, తమ భర్తలైన త్రిమూర్తులను ప్రోత్సహించి పంపారు. అప్పుడు వారు ముగ్గురు బ్రాహ్మణ వేషధారణలతో వచ్చి భిక్ష అడిగారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఇంట్లోలేరు. నదికి స్నానం నిమి త్తం వెళ్ళారు. అనసూయ ఆ ముగ్గురు బ్రాహ్మణులకు ఆతిధ్యం ఇవ్వబోగా, వారు ”మాకొక నియమం ఉంది. నువ్వు వివస్త్రరాలై మాకు వడ్డిస్తేనే భిక్ష స్వీకరిస్తామన్నారు. వడ్డించిన విస్తర్ల ముందు నుండి లేపితే పాపం అని, ”ఏమిటి? పరీక్ష?” అని భావించి, తన ప్రాతివత్యంతో వచ్చింది త్రిమూర్తులని గ్రహించి వారిని మంత్ర సంప్రోక్షణతో పసి పిల్లలుగా మార్చి తన స్తనంను అం దించింది. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ, సర స్వతీ, పార్వతీ ముగ్గురు వచ్చి, అనసూయను పతిభిక్ష పెట్టమని అభ్యర్థించారు. ఆమె వారిని మళ్ళీ త్రిమూర్తులుగా చేసింది. వారు సంతో షించి వరం కోరుకోమంటే ”మీకు నేను మాతృమూర్తిగా స్తనాన్ని అందించాను. కనుక మీరు నా బిడ్డగా జన్మించమని కోరింది. అప్పు డు దత్తుడు జన్మించాడు.
అలాగే సుమతి అనే పతివ్రత తన భర్తకు మాండవ్య మహర్షి ఇచ్చిన శాపం కారణం గా సూర్య గమనాన్ని నిరో ధించింది. దానితో భూమి తిరగక, కాలం ఆగిపోయింది. దాం తో దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్ళి అడిగితే, అనసూయ వల్లనే సొధ్యమవుతుంది. ఆమెను కోరండి అని పంపితే, విషయాన్ని గ్రహించిన అనసూయ సుమతిని ఒప్పించి, మళ్ళీ యథాతథం గా చేసింది. సుమతి భర్త మాండవ్య మహర్షి శాపానికి మరణిం చినా, అనసూయ తన ప్రాతివత్యంతో పునరుజ్జీవుణ్ణి చేసింది. అప్పుడు వరం కోరుకోమని త్రిమూర్తులు అంటే మీలాంటి పుత్రుడు కావాలని కోరింది. అప్పుడే దత్తాత్రేయుడు జన్మించాడు.

– అనంతాత్మకుల రంగారావు
7989462679

Advertisement

తాజా వార్తలు

Advertisement