Saturday, November 23, 2024

తెలుగు నేలపై శైవమత వ్యాప్తి

చారిత్రక యుగమున శాతవాహన, చాళుక్య, రాష్ట్రకూట, కాకతీయ, అనంతర కాలమున హైందవ సంస్కృతీ సభ్యతలకు ఆలవాలమైన తెలుగు నేలలో వివిధ రాజన్యుల ఏలుబడులలో శైవమతం పరిఢవిల్లింది. క్రీ.పూ.2వ శతాబ్ది నాటికే తెలుగు నేలలో శైవా రాధన ఉంది. గాథాసప్తశతిలో గౌరీ, పశుపతి స్తోత్రముంది. 1వ శతాబ్దంలో శైవంలో అత్యంత ప్రాచీనమైన పాశుపత శైవాన్ని లకులీస శివాచార్యుడు స్థాపించారు. చేతికందుతున్న చరిత్ర ఆధారంగా శ్రీముకుడు కాణ్వ రాజైన సుశర్మను వధించి, మగధను ఆక్రమించి, శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని, వివిధ చరిత్రకారుల అభిప్రాయాన్ని అనుసరించి, శ్రీ.పూ.1వ శతాబ్దిగా స్పష్టమవుతున్నది. శ్రీముకుడు జైన మతాన్ని స్వీకరించి, అనేక ఆలయాలను నిర్మించాడు. శాతవాహన 17వ రాజైన హాల చక్రవర్తి, సింహళ రాకుమారి లీలావతిని సప్త గోదావరీ తీరస్థ భీమేశ్వరాలయం, నేటి జగిత్యాల జిల్లాలోని వేంపెల్లి వెంకటరావుపేటలో వివాహ మాడినట్టు నాటి భీమేశ్వరాలయం ఉన్నట్లు నిరూపితమైంది. బౌద్ధ మతంలోనూ నాగదేవత అరాధన ఉంది. ఇక్ష్వాకు (క్రీ.శ.253- 277) రాజైన ఎహు వల శాంతమూలుని సేనానియైన ఎలిశ్రీ ఏలేశ్వ రం నిర్మించి, సర్వదేవాలయమనే శివాలయా న్ని నిర్మించాడు.
ఆలయంలో సప్తమాతృకల వద్ద గాజులను సమర్పించేవారని శాసనాధారం. వీరికాలంలో స్కంద గణపతి, యక్షుడు, హరీతి దేవతలను పూజించేవారు. అనంతర వాకాట రాజులలో అధి కులు శైవులు. మొదటి రుద్రసేనుడు మహా భైరవుని భక్తుడు కాగా, మొదటి పృధ్వీసేనుడు మహేశ్వర భక్తుడు. క్రీ.శ.358నుండి 569వరకు 210 ఏళ్ళు తెలంగాణను, ఉత్తరాంధ్రను పాలించిన విష్ణుకుండినులు నేటి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ (అమలపురం), నల్గొండ జిల్లా లోని వలిగొండ మండలంలోని ఇంద్రపాల నగరం. వీరు బ్రాహ్మణ మతావ లంబులు, శివభక్తు లు. రెండవ మాధవవర్మ (క్రీ.శ.440- 495) 100కుపైగా యుద్ధాలు చేసి, విజయాలు సాధించి, ఒక్కొక్క విజయానికి గుర్తుగా కీసర గుట్టపైన ఒక లింగ ప్రతిష్ఠ చేశాడు. విజయం సాధించిన చోటల్లా రామలింగేశ్వర ఆలయం కట్టించాడు. శ్రీశైలం మల్లికార్జునునికి చంద్రగు ప్తుడు అనే రాజు బంధువైన చంద్రవతి ప్రతిష్టించినదని చెపుతున్న గుప్త మహేశ్వర ఆలయ శిథిలాలు, నేటికీ శ్రీ శైల ఉత్తర ద్వార క్షేత్రమైన ఉమామహేశ్వరా నికి ఉత్తరాన ప్రతాపరుద్ర కోటకింద వాయవ్య మూల న రోడ్డుకు దక్షిణాన ఉన్నా యి. శ్రీశైల మల్లికార్జునుడు విష్ణుకుండినుల కాలంలోనే బహుళ ప్రచారం పొందా డు. 2వ మాధవవర్మ అనేక రామలింగేశ్వరాలయాలు కట్టించాడు. గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి తాలూకా వేల్పూరు లో, కీసరగుట్టలో రామలింగేశ్వరాలయాలు నేటికీ దర్శనీయ స్థలాలే. తూర్పు చాళుక్య 2వ విజ యాదిత్యుడు 108 విజయాలకు గుర్తుగా 108 భీమేశ్వరాలయాలు నిర్మించాడు. జైన మతం విష్ణుకుండినుల కాలంలోనే దాదాపు కనుమరుగు కాగా, జైన ఆలయాలు శివాలయాలైనాయి. వేములవాడ చాళుక్యులు వేములవాడలో నిర్మించిన రాజరాజేశ్వరాలయం తెలంగాణలోని ప్రముఖశివాలయం. బద్దెగ(క్రీ.శ.850-895) వేములవాడలో బద్దిగేశ్వర (భీమేశ్వర) ఆలయా న్ని నిర్మించాడు. క్రీ.శ.7వ శతాబ్ది శాసనంలో శివమండల దీక్ష ప్రసక్తి ఉంది. శ్రీశైలం, అలంపు రం, బెజవాడ, పిఠాపురం నాటి శక్తి పూజా కేంద్రాలు. చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమే శ్వరాలయం నిర్మించాడు. భీమవరం, పాలకొల్లు, అమరావతి ఆలయాలు చాళుక్య నిర్మాణాలే. ఇవికాక ధర్మపురి, అనుమకొండ, ఐనవోలు, పానగల్లు, నందికంది, శనిగరం, పుష్పగిరి, అమరావతి, సామర్లకోట, భీమవరం, పాలకొల్లు గొప్ప శైవక్షేత్రాలు. కాకతీయుల కాలంలో 5500 శైవాలయాలు, 1300 వైష్ణవాలయాలు, 2400 మల్లారదేవుని గుళ్ళు…ఇలా 4400 గుడులు ఉండేవని స్పష్టమ వుతున్నది.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement