Thursday, September 19, 2024

ఆధ్యాత్మికత దైవానుగ్రహం!

ఆధ్యాత్మిక జీవనం ఎంత ఆనందకర మైనదో అంత క్లిష్టమైనది. గృహస్థు లకైతే అడుగడుగునా సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. ఒక గురువు ఉపదే శముతో నడచినా, సనాతన వాఙ్మయంలోని ధర్మసూక్ష్మములను అనుసరించినా సంసార గమనంలో పరిష్కరించు సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. అధ్య యనం, సాధన పెరిగే కొలదీ ధర్మవిచక్షణ విశ్లేషణాత్మకంగా మారుతుంది. తమకు తాము అనుసరించడమే కాకుండా ఇతరులకు మార్గదర్శకంగా నిల బడవలసి ఉంటుంది. ఈ పరిక్రమములో సద్గురువులు, సంద్గ్రంధముల ఆవ శ్యకత అనివార్యం.
దానము, సహాయం, సలహా, శరణాగతిని ఇచ్చుట, స్నేహం నిలుపకోవ డం ఇలా ఒకటేమిటి? నిత్యం సంఘర్షణ తప్పదు. ప్రతి మనిషి ఆశతోనే జీవిస్తా డు. ఆశ వెనుక స్వార్థం నిలబడి ఉంటుంది. త్రిగుణాలు ఆక్రమించుకోవడానికి నిలిచి ఉంటాయి. స్వార్థపు ఆలోచనలు భౌతిక, మానసిక శక్తిని హరించివేస్తా యి. కోరికల పడగ ఎల్లవేళలా బుసకొడుతూ ఉంటుంది. అరిషడ్వర్గాలు లొం గదీసుకోవడానికి పొంచి ఉంటాయి. కుటుంబ గణపు మనోభ్రమణాలు యజ మానిని నియంత్రిస్తాయి. వీటన్నిటినీ అతిక్రమించి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడ వలసిన బాధ్యత ఆధ్యాత్మిక జీవనాపరులకు ఒక ఆభరణం.
ఇటువంటి గంభీరమైన జీవిత గమనం ఒక్కొక్కసారి భయంకరమైన నిశ్శబ్దంతో నిండిపోతుంది. మరొకసారి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతుం ది. అటువంటి సమయంలో ఏకాంతం కోరుకున్నా, మనసనే పదార్థం గంద రగోళపరుస్తుంది. అటువంటి విపత్కర పరిస్థితిలో కూడా చురుకుగా తన బు ద్ధిని పనిచేయించగలిగేవాడు, తీవ్రమైన సంసార కార్యకలాపాలలో మునిగి యున్ననూ ఎడారి నిశ్శబ్దాన్ని, ఏకాంతాన్ని సద్విని యోగపరిచేవాడు, అహంకార చిత్తాలను లొంగదీ సుకొని ఆత్మనిగ్రహంతో నిలబడేవాడిని ఆదర్శవం తుడు, వివేకవంతుడు అంటారు.
అపాత్రదానం దుష్టులకు శరణాగతినివ్వడం, స్నేహా న్ని వంచనల వలయంలోకి నెట్టడం మొదలైన విష యాల వల్ల పుణ్యానికంటే పాపమే చేరువ అవుతుంది. కాబట్టి జాగరూకులై మెలగవలసి ఉంటుంది. ప్రతి మని షిలోనూ జ్ఞానం అంతర్గతంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే రజోగుణ, తమోగుణ ప్రభావం వల్ల మనసు ను మాయ ఆవరించి జ్ఞానాన్ని మరుగునపడేస్తుంది. వి శ్వంలో భూమి ఉనికిని తెలుసుకునే జీవి ఈ ప్రకృతిలో ప్రవేశి స్తుంది. అంటే నీలి గోళము సమగ్ర జ్ఞా నం దానికి ముందే తెలుసు. మనసుకు విశ్వరహస్యం ముందే తెలుసు. మనసు నుండే విజ్ఞానం పరిఢవిల్లింది.
మంచిచెడుల విచక్షణా జ్ఞానం, మానవజన్మ గమ్యం మొదలయినవి మాత్రం అనంత జ్ఞానకేంద్రం అయిన అంతరాత్మ మీద గల ఆచ్ఛాదనను తొల గించినపుడు మాత్రమే తెలుస్తుంది. అ పుడే అసలయిన విషయం తెలుసుకున్నాడు అనవచ్చు. గొప్ప రహస్యం ఏమి టంటే? నిత్యముక్తులైన ఆత్మ స్వరూపుల ఉనికి వల్లనే మానవజాతి ఆధ్యాత్మిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. వీరు మాత్రమే అలౌకిక దృశ్యాలను ఆవిష్క రించగలిగే శక్తిని కలిగి ఉంటారు. అటువంటి వారు పుట్టుకతోనే జీవన్ముక్తులై ఉంటారు. కానీ సాధారణ మానవుల వలె కనిపిస్తారు. అటువంటి వారి సాంగ త్యంలోని వారిలోని జ్ఞానం దీపంవలె ప్రకాశిస్తుంది. సత్యం బోధపడుతుంది.
ఈ అంశాలన్నింటికీ దైవానుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎవరైతే మనోవాక్కాయలలో పవిత్రతను కలిగియుంటారో, పరమాత్మ మీద తీవ్రమై న భక్తి కలిగి ఉంటారో, నవవిధ భక్తి మార్గాలను పరిపూర్ణం చేసుకుంటారో, శుద్ధమైన జపధ్యానాదులు సాధన చేస్తారో, అటువంటి వారి మీద భగవంతు ని అనుగ్రహం కురుస్తుంది. వారు ధర్మాధర్మ విచక్షణా శక్తిని కలిగి ఉంటారు. జగన్మాయలో పడకుండా నిలబడతారు. వారు ఆత్మానుభూతిని పొందుతా రు. వారి మీద ఆ పరమాత్మ అపారమైన దయను చూపుతాడు.
ఎవరైతే వీటికి దూరంగా ఉంటారో వారి మీద భగవంతుడు జ్ఞానకృప చూపించడు. వారు తిరిగి అధోయోనులలో పరిభ్రమించవలసినదే! అందుకే తరతరాల నుండి ఈ కర్మభూమైన భరత ఖండంలో కొనసాగుతున్న ఆధ్యా త్మిక మార్గాన్ని అనుసరించువారు వివేకవంతులు. ఆధ్యాత్మిక పరులను ధ ర్మం వరిస్తుంది. వారి నుండి అది ప్రయోజనకారియై జగతిని ఆక్రమిస్తుంది.
ధర్మాదర్థ: ప్రభవతి ధర్మాత్‌ ప్రభవతే సుఖమ్‌|
ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్‌||
ధర్మం వలననే సంపదలు లభిస్తాయి. ధర్మం వలననే సుఖం లభిస్తుంది. ధర్మం చేత సర్వమూ లభిస్తుంది. ఈ జగత్తుకు ధర్మమే ఆధారం. ఈ మాటలు వనవాసంలో సీతాదేవి శ్రీరామునితో పలికినవి. యుగధర్మం మారవచ్చును కానీ మూలధర్మ స్వరూపం మారదు. అది ఎల్లవేళలా ప్రకృతి, మానవ మనుగడపు కళ్యాణాన్ని కోరుకుంటుం ది. తద్వారా మనుజుడు జన్మరాహి త్యం పొందుతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement