Friday, November 22, 2024

ఆధ్యాత్మిక సిరి – సురేంద్రపురి

అమరేంద్రపురి.. ముక్కోటి దేవతల స్వర్గపురి సురేంద్రపురి
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌ నగరానికి 60 కి.మీ. దూరంలో యాదాద్రికి వెళ్ళే దారిలో (సుమారు 2 కి.మీ ముందుగా) 17ఎకరాల విస్తీర్ణం లో వ్యాపించియున్నది. 4 ఎకరాల్లో చారిత్రక వైజ్ఞానిక సంగ్రహాలయం వుంది. కుందా సత్యానారాయణగారి అకుంఠితదీక్ష, అవిరళకృషి. అవిశ్రాం త శ్రమ ఫలితమే ఈ ఆధ్యాత్మిక కళాధామం. ఆధ్యాత్మికత అనగా సృష్టి లోని ప్రతిదానిని తెలుసుకోవ డం అని అర్థం. హైందవ సంస్కృతికి మెట్టినిల్లు, పుట్టినిల్లు. సప్తలోక సందర్శనం (బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోకం, నాగలోకం, ఇంద్రలోకం, యమ లోకం,పాతాళలోకం) అతి సుందరమైన రీతిలో చిత్రీకరిం చడం జరిగినది.
యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సురేంద్రపురి హను మదీశ్వర ఆలయం తప్పక సందర్శించదగిన ప్రదేశం. కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూ ధర్మ శిల్పకళా క్షేత్రం. పర్యాటకులను ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లగ లిగిన హిందూ ధర్మ ప్రదర్శనశాల. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, పురాతన ప్రాము ఖ్యంకల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజితంగా అలంకరించి చూపరులకు కనువిం దు చేస్తున్నారు. ఇక్కడ చతుర్దశ లోకాలైన సత్యలోకం (బ్రహ్మ), తపలోకం (దేవదాసీలు), జనలోకం (బ్రహ్మకుమా రులు), మహార్లోకం (మార్కండేయులు), స్వర్లోకం (స్వర్గం), భువర్లోకం (భూమి, సూర్యుడికి మధ్య ఉన్నది), తలాతల లోకం (మాయ నివసించు ప్రాంతం), మహాతలలోకం (నాగుల ప్రాంతం), రసాతలలోకం (దానవుల ప్రాంతం), పాతాళలోకం (నాగలోకం)లలో సప్త లోకాలను దృశ్యరూ పంలో చూడటానికి రెండుకళ్ళు సరిపోవు. పద్మ రూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు.
మహాభారత, భాగవతం వంటి పురాణతిహాసాలలో చోటుచేసుకున్న దృశ్యాలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న ది ఈ సౌందర్యపురి. మంధర పర్వత సాయంతో క్షీరసాగర మథనం చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారం లోఓ ఉన్న విష్ణుమూర్తిని చూడవచ్చు. గజేంద్రమోక్షం సన్నివేశాలు కనువిందు చేస్తాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవ చ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడు విగ్రహం మనసుకు ఆనందాన్ని కలుగచేస్తుంది. గోవర్ధనోద్ధ రణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షస సంహారం మొదలయిన దృశ్యాలను చూడవచ్చు. పంచముఖ శివుడు కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమం తుని విగ్రహం, ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుని దర్శనం సర్వపాపహరణం. ఈ దేవాలయ ముఖ ద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. అమ్మవారి వాహనం సింహం నోటినుండి కళా ధామాని కి ఏర్పాటుచేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటు ంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాల యాల నమూనా రూపాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయం ఆవర ణలో గల అద్దాల మండపం, కొండ పైన ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి. 101 అడుగుల మహాశివలింగ దర్శనం కాలసర్ప దోషనివారణం. నవగ్రహదేవాలయాల సందర్శనం గ్రహ పీడా విమోచనం. ఇక్కడున్న అష్టా దశ శక్తిపీఠాల దర్శనం – సర్వగ్రహ పీడావిమోచనం. వృద్ధి చెందిన వాస్త విక సాంకేతికత ద్వారా రూపొందించబడిన ‘నరసింహావ తార పరిచయం’ దేశంలోనే మొదటిసారిగా రూపొందించ బడినది. నేడు ఈ ‘సురేంద్రపురి’ శ్రీమతి కుందా ప్రతిభగారి సారధ్యంలో దేదీప్యమానమై దినదినాభి వృద్ధి చెందుచున్న ది. ‘ఆరాటం ముందు పోరాటం విలువెం త’ సంకల్పం ముం దు వైకల్యం విలువెంత- ధృడచిత్తం ముందు దురదృష్టం విలువెంత – ఎదురీత ముందు విధిరాత విలువెంత’. ‘ సుందరం సుమనోహరం సురేంద్రపు రం’ ఈ ఆధ్యాత్మిక సిరిని వీక్షించడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
– లక్ష్మీకాంతం
విశ్రాంత భారత పరిపాలనా సేవకుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement