బౌద్ధం 2,500 సంవత్సరాల క్రితం పుట్టింది. భారతదేశంలోనే అయినా… శ్రీలంక, టిబెట్, మయన్మార్, థారులాండ్‌లతో సహా అనేక దేశాలలో విస్తరించింది. గౌతమ బుద్ధుడు జన్మించినప్పటి నుంచి నిర్యాణం చెందేవరకు నడయాడిన ప్రదేశాలన్నీ బౌద్ధంలో పవిత్ర స్థలాలే. ప్రపంచంలో అనుసరించే ప్రధాన మతాలలో ఇది ఒకటి. గౌతమ బుద్ధుడు బోధి వృక్షం కింద కూర్చుని జ్ఞానోదయం పొందిన రోజును గుర్తు చేసుకునే బౌద్ధ వార్షిక ఆచారం బోధిడే (డిసెంబర్ 8). ఈ మతస్థులు దేవుడిని దేవతలను ఆరాధించరు. ఎల్లవేళలా ఆధ్యాత్మిక జ్ఞానోదయంపైనే దృష్టి పెడతాడు.
ప్రపంచ వ్యాప్తంగా మిలియన్లమందికి అత్యంత ముఖ్యమైన రోజు ఈ బోధి దినోత్స వం. చైనా, కొరియా, జపాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లోని సాంప్రదాయులు పాఠ శాలలకు, కార్యాలయాలకు కూడా సెలవును ప్రకటించి మహాయాన సంప్రదాయం లో బోధి దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును ప్రతి సంవత్సరం గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన రోజును గుర్తుచేసుకోవడానికి బోధి దినోత్సవం జరుపుకోవడానికి బౌద్ధ సెలవు దినంగా ప్రకటిస్తారు. జ్ఞానోదయం అనే పదాన్ని సంస్కృతం, పాళీ భాషలలో బోధి అనికూడా అంటారు. గౌతముడిని బుద్ధుడిగా మార్చిన ఆ బోధి వృక్షం మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయలో వుంది. అయితే అశోకుడి కాలంలో బౌద్ధాన్ని అంతరింపచేయడానికి ఆ వృక్షం పలుసార్లు ధ్వంసం చేశా రు. అప్పుడు అశోకుడు తిరిగి శ్రీలంకలోని అనురాధపురంలో వున్న బోధి వృక్షం శాఖను తీసుకువచ్చి మరల గయలో పాతినట్లు చరిత్ర చెబుతోంది.
ఈ బోధి దినోత్సవాన్ని ఆధ్యాత్మికతను మే ల్కొలిపే రోజుగా భావించి ధ్యానం, ధర్మాన్ని అధ్యయనం చేయడం, బౌద్ధ గ్రంథాలను (సూత్రాలు) పఠించడం లేదా ఇతర జీవుల పట్ల దయతో వుండి, వాటిని సంరక్షించడం లాంటివి చేస్తారు.
ఈరోజు ”వెయ్యి యుద్ధాలు చేసి గెలవడం కంటే నిన్ను నువ్వు గెలుచుకోవడం ఉత్తమం. అదే అసలైన విజయం.”
”ఏ సమయం… సందర్భంలో అయినా ద్వేషం ద్వేషంతో ఆగదు. ప్రేమ ద్వారానే ద్వేషం ఆగిపోతుంది. ఇది ఎవరూ మార్చలేని చట్టం.”
”నాలుక పదునైన కత్తిలాంటిది. రక్తం కారకుండా చంపేస్తుంది.”
”ఆరోగ్యం గొప్ప బహుమతి, సంతృప్తి గొప్ప సంప ద.” లాంటి గౌతమ బుద్ధుని బోధలను స్మరించుకుంటా రు. వాటిని తమ జీవితంలోకి ఆహ్వానించడానికి, అమలు చేయడానికి ఈరోజును ఒక గొప్ప అవకాశంగా భావిస్తా రు. వేడుకకు గుర్తుగా ప్రజలకు ప్రత్యేక కుకీలతోపాటు బియ్యం, పాల వంటకాలను పంచిపెడతారు. బౌద్ధ ధర్మా న్ని ఆచరిస్తారు. అధ్యయనం చేస్తారు.
బౌద్ధ ధర్మంలో చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా బోధి వృక్షానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. సిద్ధార్థ గౌతము డు రావి వృక్షం కిందే బుద్ధునిగా అవతరించారు. అందుకే రావిచెట్టును బౌద్ధ ధర్మవాదులు బోధి వృక్షంగా గౌరవిస్తా రు. భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా నెలకొల్పిన టువంటి వివిధ బౌద్ధ విహారాలలో ఈ బోధి వృక్షాన్ని అత్యంత గౌరవప్రదంగా నాటి పూజిస్తారు. బోధి చెట్టును పోలి ఉండేలా అత్తి చెట్టును అలంకరిస్తారు. బౌద్ధ ధర్మం పాటించేవారు ఈ వృక్షం దగ్గర ఒకరినొకరు బుదు శరణౖ అని అభినందించుకుంటారు. ఈరోజు బౌద్ధమత విశ్వాసు లందరూ ఆధ్యాత్మిక జ్ఞానోదయంపై దృష్టి పెడతారు.
గౌతముడిని బుద్ధుడిగా మార్చిన ఆ బోధి వృక్షం మన భారతదేశంలోని బీహార్ రాష్ట్రంలోని గయలో వుంది. బౌద్ధులకు, గౌతమ బుద్ధుని జీవితా నికి సంబంధించిన ప్రధాన నాలుగు పుణ్యక్షేత్రాలలో బోధ్‌గ య ప్రధానమైనది. ఇక్కడున్న బోధి వృక్షం దక్షిణ కొమ్మనుంచి ఒక శాఖను క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో అశోక రాజు తన కుమార్తె బౌద్ధ సన్యాసిని అయిన సంఘమిత్రకు ఇచ్చాడు. సంఘమిత్ర బౌద్ధ ప్రచా రానికి భారత్ నుంచి శ్రీలంక వెళ్ళినపుడు ఈ బోధి వృక్షం కొమ్మను తీసుకువచ్చింది. అప్ప ట్లో అనురాధపురాన్ని పాలిస్తున్న రాజు ఆ మొక్కను సంఘమిత్ర నుంచి గౌరవంగా స్వీకరిం చి అక్కడ నాటినట్లుగా అనురాధపురంలో ఏర్పాటు చేసిన విగ్రహాల ద్వారా తెలుస్తుంది.
అనూరాధపుర బౌద్ధక్షేత్రాలకు ఆలవాలం. అభయగిరి స్థూపాలే కాక అక్కడి మహాబో ధి వృక్షం టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది బుద్ధగయలోని శ్రీలంక, భారత దేశాల స్నేహ బాంధవ్యాలకు ఈ వృక్షం నిలువెత్తు సాక్ష్యం. ఈ బోధి చెట్టు కొమ్మను అనురా ధపురలో సుమారుగా క్రీస్తు పూర్వం 245లో నాటినట్లు అక్కడి శాసనాలు చెప్తున్నాయి. ఇది అత్యంత పురాతనమైన వృక్షంగా చారిత్రక రికార్డు కూడా ఉంది. బోధ్ గయలోని ఈ బోధి వృక్షం కిందే బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని, ఆ తర్వాత బౌద్ధాన్ని అంతరింపచేసే కుట్ర లో భాగంగా ఈ వృక్షాన్ని వేళ్ళతో సహా కొందరు నాశనం చేసినట్లు చెపుతారు. తిరిగి బౌద్ధ పరిరక్షణ కోసం అనూరాధపురలో సంఘమిత్ర నాటిన మహాబోధి వృక్షం నుంచి మొక్కను తీసుకువచ్చి బోద్ గయలో నాటినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
ఒక్క బోధి వృక్షమే కాక అనురాధపురలో ఎన్నో ఉత్తేజకరమైన దేవాలయా లు,మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. దాగోబాల ఇటుక స్థూపాలు అక్కడ మనం చూసి తీరాల్సిన ప్రదేశాలు. అనురాధపురలోని పాత విభాగం, ఇప్పుడు పురా వస్తు ఉద్యానవ నంగా మారింది. 1982లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగాను, శ్రీలంకలోని పురాతన శిథిల మైన నగరాలలో ఒకటిగానూ ప్రసిద్ధి చెందింది.
అక్కడి సమీపంలో చిన్న చిన్న ఇటుకలతో నిర్మించిన గంటాకారపు డాగోబాలు, దేవాలయాలు, శిల్పాలు, రాజభవనాలు, పురాతన తాగునీటి రిజర్వాయర్‌లు బుద్ధుని చరిత్రకు తార్కాణాలు.