హైదరాబాద్, ప్రభ న్యూస్: భగవద్రామానుజుల సహస్రాబ్ది సమారో హం కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగు తున్నాయి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఇలవైకుంఠాన్ని తలపిస్తోంది. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో పులకించింది. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని దర్శించుకునేం దుకు భక్తులు భారీగా తరలివస్తు న్నారు. శ్రీమన్నారా యణ మంత్రంతో ముచ్చింతల్ మార్మోగుతున్నది. ఏడో రోజు మంగళవారంనాడు శ్రీరామనగరంలో రథ సప్తమి ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారా యణ కార్యక్రమాలు నిర్వహించారు. నేడు యాగశాలలో దుష్ట గ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగ రంగ వైభవంగా జరిగాయి. శ్రీలక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆదిత్యహృదయం సామూహిక పారాయణం చేశారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహూబిలం రామానుజజీయర్ స్వామీజీ నిర్వహించారు.
ధర్మాచార్య సదస్సు
శ్రీరామానుజుల సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ సంకల్పించారు. శ్రీరామనగరంలోని ప్రవచన మండపంలో ధర్మాచార్య సదస్సును నిర్వహించారు. దేశంలోని అన్నిప్రాంతాల నుంచి విచ్చేసిన 200 మందికి పైగా ధర్మాచార్యులు, స్వాములు, సాధుసంతుల సలహా లను కోరారు. ధర్మాచార్య సదస్సులో నాలుగు ప్రధాన అంశాలను చర్చించారు. రామానుజాచా ర్యుల శ్రీమూర్తి లోకార్పణం చేశామన్న చిన్నజీయ ర్ స్వామీజీ.. సమతా సాధనకు కృషి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. దేశంలో కుల, మత, జాతి, వర్గాలను సమాజం నుంచి తొల గించాలంటే ఎలాంటి మార్గదర్శనం చేయాలో సూచన లివ్వాలన్నారు. ప్రతీరంగంలోనూ హెచ్చుతగ్గుల భావన నుంచి ప్రజలను బయటకు తీసుకొచ్చేందుకు మంచి మార్గాన్ని అన్వేషించాల న్నారు. మానసిక ఉజ్జీవన, సమాజ ప్రగతికి ఎలాంటి సూచనలు చేయాలో ధర్మా చార్యులు తెలియజేయాలని కోరారు. ప్రభుత్వాల నుంచి వివిధ రంగాల ప్రముఖుల నుంచి ఏ విధమైన సహకారం తీసుకోవాలో సూచించాల న్నారు. సనాతన ధర్మంలో స్వీయ ఆచారా లు చేసు కుంటూ పక్కవారి ఆచారాలను కూడా గౌరవిస్తూ సమాజ ప్రగతికి, అసమానతలను రూపు మాపేం దుకు కృషి చేయాలన్నారు. ప్రాచీన వ్యవసాయక జీవన విధానాన్ని మెరుగు పర్చుకొని.. ప్రస్తుత జీవన విధానంలోకి ఉపయోగకరంగా మార్చు కోవాలన్నారు. రేపు కూడా ధర్మాచార్య సదస్సు జరగనుంది.
తెలుగు రాష్ట్రాలనుంచి 80 మంది
ధార్మిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 80 మంది స్వామీజీలు, పీఠాధిపతులు పాల్గొన్నారు. అష్టాక్షరీ జీయర్ స్వామి, పరిపూర్ణానందగిరి, శివస్వామి, స్కందదేవానంద, మా తా నిర్మలానందమయి, మాతా శివచైతన్య, రాధామనోహర్ స్వామి హాజరయ్యారు. ఏపీ సాధుపరిషత్ నుంచి అనేక మంది స్వాములు పాల్గొన్నారు. ఇక ఉత్తరాది నుంచి 80 మంది స్వామీజీలు, సాధువులు, పీఠాధిపతులు హాజర య్యారు. వీరిలో10 మంది మహామండలేశ్వరులు ఉండటం విశేషం, బీహార్ నుంచి మహంత్ రామ్ దేశ్‌జీ విచ్చేశారు. ఆదిశంకరాచార్యులు స్థాపిం చిన కాశ్మీర్ సర్వజ్ఞ పీఠాధిపతి హాజ రయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి కూడా సాధుసంతులు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సర్ సంఘ్ చాలక్ బాగయ్య పాల్గొన్నారు. వీహెచ్‌పీ ఇం టర్నేషనల్ జనరల్ సెక్రటరీ మిలింద్ పరాంజీ, సంయుక్త ప్రధానకార్యదర్శి కోటేశ్వరశర్మజీ, ఉపాధ్యక్షులు దినేష్ చందర్ జీ, సంయుక్త ప్రధానకార్యదర్శి రాఘవులు హాజరయ్యారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ప్రవచన మండపంలో సాంస్కతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఆధ్యాత్మికవేత్త వీఎస్‌ఆర్ మూర్తి రామానుజ వైభవంపై ప్రవచనాన్ని అందించారు. సౌమిత్రి సిస్టర్స్ అంజలి, విష్ణుప్రియ ఆలపించిన రామా నుజాచార్యుల గీతాలు ఆకట్టుకున్నాయి. శ్రీమాన్ నరసింహారావు, శ్రీ అద్దంకి శ్రీనివాస్, శ్రీమాన్ వెంకటా చార్యులు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. కుమారి మువ్వ ఆంధ్రనాట్యం, సుకన్యారాజగోపాల్ బృందం వారి ఘటం, విజయానంద్ గానం అలరించాయి. సాయంత్రం వేళ విష్ణుసహస్రపారాయణం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది.
ప్రముఖుల సందర్శన
శ్రీరామానుచార్యుల 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు వీవీ వినాయక్, రాజేంద్రప్రసాద్, దిల్ రాజు సమతామూర్తిని దర్శించుకున్నారు. కాగా మంగళవా రంనాడు పెద్దసంఖ్యలో భక్తులు, ప్రముఖులు సమతామూర్తి విగ్రహ సందర్శనకు తరలివచ్చారు. ఉదయం శ్రీమన్నారాయణ క్రతువుకు హాజరైన సుమారు 22 వేలమందికి ఉపాహారం, మధ్యహ్నాం వరకు హాజరై నవారిలో 55వేలమందికి భోజనవసతి కల్పించారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
నేటి కార్యక్రమాలు
రోజూ మాదిరిగా బుధవారం ఉదయాన్నే శ్రీమన్నారాయణ క్రతువు నిర్వహి స్తారు. ప్రజలకు సంపద, సంపూర్ణ ఆరోగ్యం కలగాలన్న సంకల్పంతో లక్ష్మీనారా యణష్టి, సత్సంతానం కోసం వైనతేయేష్టి నిర్వహిస్తారు. ఉదయం 9.30 నుంచి హయగ్రీవ పూజ, ధర్మాచార్యుల సదస్సు కొనసాగిస్తారు. సాయం త్రం సదస్సు తీర్మానంలోని విషయాలను వెల్లడిస్తారు. మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ద్వారం లక్ష్మి గాత్రం, డాక్టర్ శూలపాణి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ వైభ వంపై పద్యనాటకాన్ని ప్రదర్శిస్తారు.