ఆర్తితో పిలిస్తే పలికే పరమాత్మ అనేక రూపాలలో నిలిచాడు. శివకేశవులు అభిన్ను లు. మహావిష్ణువు అలంకార ప్రియుడు. మహాశివుడు అభిషేక ప్రియుడు. కనుకనే మహాశివునికి ఆ స్థానమైన కాశీలో శివాభిషేకాలు ప్రత్యేకం. అలంకార ప్రియుడైన మహావిష్ణువు వివిధ నామరూపాలతో కొలువైన క్షేత్రాల్లోని ఏ క్షేత్రమైనా పలు ప్రత్యేకతలకు ఆలవాలంగా ఉంటుంది. శివాలయాల్లో పార్వతీదేవి భక్తుల కడగండ్లను వారి క్షుద్బాధను తీరిస్తే మహాలక్ష్మీదేవి విష్ణు ఆలయాల్లో భక్తుల కోరికలను, వారి ఆకలి బాధలను తీరుస్తూ ఉంటుంది. ఎక్కడైనా అమ్మ అయ్య ఒక్కరే. రూపమేలేని భగవంతుడు అనేక రూపాల్లో దర్శ నమివ్వడం, నామమేలేనివాడు అనంత నామధారునిగా ప్రకటితమవ్వడం అంటే అవ్య క్తుడైన పరమాత్మ వ్యక్త్తమవ్వడమే.
భారతీయ ఆధ్యాత్మిక భావ భూమిక మహాశక్తి ప్రాతిపదికనే ఏర్పడింది. ఈ విశ్వంలో సమస్త సృష్టికి ఆమెయే చైతన్యం. ఆమెయే బుద్ధి, ఆమెయే నిద్ర… మూల ప్రకృతి స్వరూపిణి ఆమె. త్రిమూర్తులైన సృష్టి, స్థితి, లయకారకులకు అమ్మవారే ఆలంబన. ఆమే శక్తి… ఆమే సంపద… ఆమే విద్య. దశ మహావిద్యలకు అధిదేవత ఆమె. మృత్యువుకు, జరామరణాలకు అందనంత ఎత్తులో, అనంతమైన ఆనందామృత స్థితికి ఆమె అధినాయిక. రామాయణ, మహాభారతాలకు స్త్రీ మూర్తే కేంద్రబిందువై దుష్ట శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయించింది. మ#హషాసుర, నరకాసురాది అసుర శక్తుల సంహార విధుల్ని నిర్వర్తించింది. మనదేశంలో శక్తిస్వరూపిణి అయిన స్త్రీమూర్తిని ఆరాధించడం అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుం ది. అనేక స్థాయిల్లో, అనేక దశల్లో, అనేక రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తుంది. అధోలోకం నుంచి ఊర్ధ్వ లోకాల దాకా అనేక అంశల్లో అమ్మవారు పూజలందుకుంటుంటారు. తెలం గాణ ప్రాంతంలో చెరువు కట్టల వద్ద నెలకొన్న కట్ట మైసమ్మ, గండిమైసమ్మ రూపాల నుం చి… వారణాసిలో అన్నపూర్ణాదేవి వరకూ అనేక రూపాలలో అమ్మవారి సాక్షాత్కారం లభిస్తుంది. ”మనుష్యుని తపస్సుకు ఫలితంగా భగవంతుడు అతడికి సంతానంగా కూడా జన్మి స్తాడు. కామార్పుకూరు వెళ్ళేదారిలో ‘రంజితరాయి చెరువు’ అనే చెరువొకటి ఉంది. కథ చెబుతా విను!” అంటూ శ్రీరామకృష్ణులు ఈవిధంగా చెప్పారు.
”రంజితరాయి ఆ ప్రాంతంలో జమీందారు. ఆయన చేసిన తపస్సు ఫలించి దివ్యజ నని ఆయనకు కుమార్తెగా జన్మించింది. ఆ అమ్మాయి అంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ, ఆమె కూడా ఎప్పుడూ తండ్రిని వదిలేది కాదు. ఒకరోజు రంజితరాయి తన జమీందారీ వ్యవహారాలలో తలమునకలై ఉన్నాడు. ఆ అమ్మాయి పసిపిల్లలకు ఉండే చిలిపి స్వభావం తో తండ్రి దగ్గర కూర్చుని, ఆయన చూస్తున్న కాగితాలతో ఆడుతూ, ‘ఇదేమిటి నాన్నా? అదేమిటి నాన్నా?’ అని విసిగించడం మొదలుపెట్టింది. పాపం! రంజితరాయి మొదట్లో ఆ అమ్మాయిని బుజ్జగిస్తూనే ”అమ్మా! అల్లరి చేయకు! పని ఎక్కువగా వుంది. నాకు చికాకు కలిగించవద్దమ్మా!” అని బ్రతిమాలాడు. కానీ ఆ అమ్మాయి అక్కడ నుండి కదలలేదు. ఆయ నను విసిగిస్తూనే ఉంది. చివరకు ఆయన పరధ్యానంగా, కొంచెం కోపంతో, ‘ఫో! ఇక్కడ నుంచి వెళ్ళిపో!’ అని గద్దించాడు.
ఇదే సాకుగా తీసుకొని ఆ అమ్మాయి ఇంట్లో నుండి బయటకు వచ్చింది. వాకిట్లో శంఖు గాజులు అమ్మేవాడొకడు కనపడ్డాడు. ఆ అమ్మాయి వాణ్ణి పిలిచి ఒక జత శంఖు గాజులు చేతి కి వేయించుకుంది. గాజులవాడు డబ్బు అడిగితే ఇంట్లో మేడ మీద తన పెట్టెలో డబ్బులు ఉన్నాయనీ, ఇంట్లో అడిగి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. చేసేదిలేక ఆ గాజులవాడు ఇంటిలోని వాళ్ళను పిలవడం మొదలుపెట్టాడు. ఇంతలో, కూతురు తన దగ్గరలేదని రంజి తరాయి గమనించాడు. ఇంట్లో ఉందేమోనని పిలిచాడు. కాని ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో వాళ్ళు అన్నిచోట్లా వెతికారు. కాని అమ్మాయి జాడలేదు. వాళ్లకు అనుమానం కలిగిం ది. మేడ మీద పెట్టెలో చూస్తే ఆ అమ్మాయి చెప్పినన్ని డబ్బులు కనపడ్డాయి. రంజితరాయి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. ఊరంతా వెతుకుతూ వాళ్ళందరూ చెరువు దగ్గరికి పరిగెత్తారు. చెరువులో చూస్తే నీటిపైన వారికి ఒక చెయ్యి మాత్రం కనిపించింది. దానికి రెండు శంఖు గాజులు ఉన్నాయి. వాళ్ళు చూస్తుండగానే ఆ చెయ్యి నెమ్మది నెమ్మదిగా నీళ్ల లో మునిగిపోయి, కనిపించడం మానివేసింది. ఆమె నీళ్ళల్లో లీనమైపోయింది. ఇప్పటికి కూడా ప్రజలు ప్రతి ఏటా అక్కడ ఉత్సవం చేస్తుంటారు. ఆ అమ్మాయి అమ్మవారుగా (దివ్య జననిగా) భావించి అర్చిస్తారు.
ఈ కథను శ్రీ రామకృష్ణులు శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహంద్రనాథ గుప్తకు చెప్పి, ”ఇదంతా యథార్థం. భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. ఒక్కొక్కసారి మనుష్య రూపంలోనూ, మరొకసారి చైతన్యవంతమైన ఇతర రూపాలలోనూ గోచరిస్తాడు. కాబట్టి దేవుడికి అనేక రూపాలున్నాయని మనం విశ్వసించాలి” అని తెలియచేశారు.
మానవులు, అభ్యుదయాలనూ, శ్రేయస్సులనూ, పురోగతులనూ కోరుకొంటారు. వీటిని ప్రసాదించగల శక్తి భగవంతుని రూపంలోనే ఉంటుందనేది యథార్థం. ఆ శక్తినే అనేక రూపాలుగా భావించుకొని పూజించడంతో అనేక పూజాసంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఏ పూజ అయినా ఈ ప్రపంచంలోని చరాచరాలకు మేలును కలిగించడానికే. ఏ ధ్యానం అయి నా మానవాళికి సుఖశాంతులను అందించడానికే. ఇదే పూజల పరమార్థం. సంస్కృతి, సం బరాల లక్ష్యం. అందరూ సుఖంగా ఉండాలనీ, అందరూ ఆయురారోగ్యాలతో కూడి ఉండా లనీ, అందరూ అభ్యుదయాలను అందుకోవాలనీ, ఏ ఒక్కరికీ దు:ఖం కలుగరాదనీ మన ప్రాచీన మ#హర్షులు భావించారు. అదే అందరి భావన కావాలి.
ఆధ్యాత్మిక భావ భూమికమహాశక్తి!
Advertisement
తాజా వార్తలు
Advertisement