Friday, November 22, 2024

ఆధ్యాత్మిక దారిదీపాలు… పీఠాలు!

పీఠం అనగానే ఆదిశంకరాచార్య స్థాపిం చిన నాలుగు పీఠాలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం సమాజంలో చాలా పీఠాలు నెల కొల్పబడ్డాయి. తమిళనాడులోని తిరునల్వే లి జిల్లాలో కుర్తాళం దగ్గర ఉన్న ”శ్రీ సిద్ధేశ్వ ర పీఠం” విశాఖపట్నంలోని శ్రీ స్వరూపా నందేంద్ర స్వామివారు నెలకొల్పిన శ్రీ శారదా పీఠం. కాకినాడలో శ్రీ పరిపూర్ణానంద స్వామి చే నెలకొల్పబడిన ”శ్రీ పీఠం”. కడప జిల్లాలో వీరబ్రహ్మంద్రస్వామి వారి పీఠం, ఇలా ఎన్నో పీఠాలు గోచరిస్తాయి. అంతకుముందు ”అష్టా దశ శక్తిపీఠాలు” కూడా ఉన్నాయి. అయితే అష్టాదశ శక్తిపీఠాలకు, ప్రస్తుతం మనం మాట్లా డుకునే పీఠాలకు తేడా ఉంది. ఏమిటంటే ఈ అష్టాదశ పీఠాలకు స్వయంసిద్ధ పీఠాలు. దక్షయ జ్ఞంలో అగ్నికి ఆహుతి అయిన, సతీదేవి శరీరాన్ని శివుడుని అంటిపెట్టుకొని ఉన్న తరుణంలో విష్ణు వు ఆమె శరీరాన్ని తన సుదర్శన చక్రంతో ఖండా లుగా చేస్తే, అవి దేశంలోని వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా పేరు పొందాయి.
ఆదిశంకరాచార్య నాలుగు దిక్కులా వేద- వేద వాఙ్మయాలను ప్రజలకు చేరువ చేయాలనే తలం పుతో, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి బింబించే విధంగా దేశంలో నాలుగు మూలల స్థా పించారు. అవి- 1) ఋగ్వేద ఆధార పీఠం తూర్పు న పూరీలోని గోవర్థనగిరి పీఠం, 2) దక్షిణాన యజుర్వేదం ఆధారపీఠం శృంగేరి లోని శారదా పీఠం. 3) ఉ త్తరాన బద్రీనాథ్‌
లో
అధర్వణ వేదం ఆధారంగా జ్యోతిర్మయి పీఠం, 4) పడమర ద్వారకలో సామవేద ఆధారిత కాంచీ పీఠం. పీఠం అంటే ఆసనము. కూర్చొండే ఎత్తు ఆసనం. సింహాసనం అని అర్థం కూడా ఉంది. అయితే ఈ సింహాసనాన్ని ఎవరు అధిరో#హస్తారు? అంటే ఒక అనుష్టాన దేవత.
కలియుగంలో ధర్మం ఒక పాదమే నడుస్తు న్నందున, ప్రజలలో అవినీతి, విచ్చలవిడితనం, అసత్యపు మాటలువంటి దుర్గుణాలు బారినుండి కాపాడుటకు, నైతికత పెంపొందించేందుకు వేదా లు, ఇతిహాసాలైన రామాయణ, భారత, భాగవత కావ్యాలలోని అంశాలను ప్రజలకు చేరువ చేయుట పీఠాల స్థాపన ముఖ్య ఉద్దేశం. పీఠం మన #హందూ సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు సనాతన ధర్మానికి చిహ్నం. కొంతమంది మఠం, పీఠం ఒక్క టే అనుకోవచ్చు. కాని మఠాలులో సాధువులు, బ్రహ్మచార్యులు సన్యాసులు ఉంటారు. పీఠంలో ఇటువంటివారితో బాటు అధిష్టాన దేవత, కొన్ని ఉప దేవతలు కొలువై ఉంటారు.

పీఠాధిపతి నియామకం

పీఠాధిపతి కావాలంటే చతుర్వేదాలు అభ్యస నం చేసి ఉండాలి. మీమాంస, తర్కశాస్త్రం వంటి అనుబంధ వేదాంగాలు కూడా అభ్యసించి పరిపూ ర్ణుడై ఉండాలి. సన్యసించి బంధాలకు దూరంగా ఉండాలి. పీఠాధిపతులు తమ వారసులుగా వేదం లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసుకొని నియమిస్తా రు. పీఠాధిపతులు తమతమ పరిధిలో #హందవ ధర్మాన్ని ప్రచారం చేస్తూ మనలో చైతన్యం కలిగి స్తున్నారు. శంకరాచార్య మొదటిగా కుంభకోణం లో పీఠాన్ని స్థాపించారు. తరువాతి కాలంలో మ#హమ్మదీయులు దాడివల్ల ఆ పీఠాన్ని కుంభకో ణం నుంచి కంచికి మార్చారు. అది ఇప్పుడు కంచి కామకోటి పీఠంగా వెలుగొందుతోంది.
కంచి కామకోటి పీఠం, తదితర కొన్ని పీఠాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతోబాటుగా ప్రజలకు ఉప యుక్తమైన సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మనకు ఈ సందర్భంగా విశ్వజనీనమైన రామకృష్ణ మఠం, గౌడీయ మఠం గుర్తుకు వస్తాయి. నిర్దు ష్టమై న, స##హతుకమైన కారణాలతో స్థాపించబడ్డాయి.

లక్ష్యం ఒక్కటే…

మఠానికి, పీఠానికి తేడా వుంది. కానీ అంతిమ లక్ష్యం ఒక్కటే. రామకృష్ణ మఠం 1897 సం. మే నెల లో పురుష సన్యాసులకు రామకృష్ణ మఠం ఏర్పాటు చేసి, ఆధ్యాత్మిక పెంపొందించేవారు. ఆయన శిష్యు డు వివేకానందస్వామి తరువాత కాలంలో దీనికి అనుబంధంగా ”రామకృష్ణ మిషన్‌”ను ఏర్పాటు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా రామకృష్ణ మఠాలు నెలకొల్పబడ్డాయి. స్వామి వివేకానంద ”రామకృష్ణ తత్త్వాలు వ్యాపింప చేయడం, అన్ని మతాల సారాం శం ఒక్కటే అని విశిదపరచడం, పనిని దైవంగా భావించి నిర్వ#హంచడం, మానవ సేవయే మాధవ సేవ అని ప్రచారం చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా రామకృష్ణ మిషన్‌ ఏర్పాటు అయ్యింది.
గౌడీయ మఠం వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రోత్స హంచే నిమిత్తం ఏర్పాటయింది. దీనిని కృష్ణ భక్తుడు చైతన్య మహా ప్రభువు బెంగాల్‌లోని మాయాపూర్‌ లో నెలకొల్పారు. అదే ”ఇస్కాన్‌ సంస్థ”గా రూపుది ద్దుకొని ప్రపంచ వ్యాప్తంగా అనేక ధార్మిక, సాంఘిక కార్యక్రమాలపై సేవ చేస్తోంది. ఇన్ని విధాలుగా పీఠాలు, మఠాలు మన సనాతన ధర్మాన్ని కాపాడు తూ ఉన్నాయి. అయినా వాటిని చూసి, చూడనట్లు వదిలేసి, మనం మన మార్గాన్ని నడుస్తుండబట్టే కష్టాలు ఎదుర్కోవలసి వస్తోంది. మనశ్శాంతి లే కుండా పోయింది. అందుకే ఇప్పటికైనా మేల్కొని, మనం ఆధ్యాత్మిక మార్గంలో పయనిద్దాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement