Thursday, September 19, 2024

విష్ణు ఆరాధనకు విశిష్టం…దేవశయని ఏకాదశి!

విశ్వము అంతా తానే అయినవాడు.
సర్వవ్యాపకుడు. వేదమంత్ర స్వరూపకుడు.
త్రికాలములకు ప్రభువు. సకల భూతములను సృష్టించి నాశనము చేయువాడు.
సమస్త భూతములను పోషించువాడు.
సమస్త భూతములకు ఆత్మ అయినవాడు.
పరము లేని ఆత్మగా నిలిచినవాడు.
ఆయనే శ్రీమహావిష్ణువు.

విశాల అనంత విశ్వంలోనున్న నక్షత్ర సమూ హమైన పాలపుంతలే క్షీరసముద్రం. శ్రవణా నక్షత్రమునకు అత్యంత ఉన్నత స్థానాన్ని విష్ణు వాసమని పేర్కొనడం జరిగినది. విష్ణు వు యొక్క స్వరూపాన్ని సనకసనాది ఆది ఋ షులు చాలా స్పష్టంగా, బీజాక్షర సహితంగా వర్ణించారు. ఆ వర్ణన ప్రకారమే అనాదిగా ఈ భూమండలం మీద విష్ణుమూర్తిని విగ్రహారా ధన చేస్తున్నారు. చతుర్భుజునిగా, అష్టభుజు నిగా, సహస్రభుజునిగా అనంతుడయిన విష్ణువు పాం చజన్యము, సుదర్శనం, శరాంగము, నందకం, కౌమోదకి అనే ఆయుధ రూపాలను తన హస్తములలో ధరిస్తూ ఉంటాడు. అనేక మంది సూర్యులు ఆయనలో ప్రకాశిస్తూ ఉంటాయి.
”సూర్య ఏకాకీ చరతి చంద్రమా జాయతే పున:” సూర్యుడు స్వతంత్రు డు, ఆయన వల్ల చంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు. ”దశదిశో నానా సూర్యా:” అష్టదిక్కులే కాకుండా దశదిశలందు అనేకమంది సూర్యులున్నారు. ఈ వేద వాక్యాలననుసరించి మన సౌర వ్యవస్ధ వరకు మనకు సమీప ప్రత్యక్ష దైవము, విష్ణువు అంశము ఆదిత్యుడు మాత్రమే! భూమండలమునకు జీవదాత సూర్యభగవానుడు. ఇంతటి మహిమాన్విత విస్తృతి కలిగిన మన సనాతన వాఙ్మయం సూర్యచంద్రుల గతిననుసరించి కాలమహిమను విశ దపరుస్తోంది. తృటి నుండి మన్వంతరము వరకు కాలపరిణామమును నిర్ణయించారు. చైత్రమాసాదిగా సూర్యుని కిరణ ప్రభావమును బట్టి ద్వాద శాదిత్య నామాలు పేర్కొన్నారు. అవి వరుసగా దాత, ఆర్యముడు, మిత్ర, వరుణుడు, ఇంద్ర, వివస్వంత, త్వష్ణ, విష్ణువు, తుర్యము, భగ, పూవ, క్ర తు. ఇక చంద్ర ప్రభావమును బట్టి తిథులు నిర్ణయించారు.
ఆ తిథులలో ఏకాదశి విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఎవరైతే కాలవిలువను, మహిమను తెలుసుకొని ప్రవర్తిస్తారో వారు సంపూర్ణ ఆయు రారోగ్యములతో ముక్తి పొందగలరని ఋషులు విశదపరచారు.
ఆషాడ శుక్ల ఏకాదశిని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పరిగణి స్తారు. ఈ మాసములో సూర్యుడు వరుణునిగా వెలుగొందుతాడు. వశిష్ఠ, రంభ, సహజన్య, హూ హూ, శుక్ర, చిత్రస్వనులు పరిజనంగా ఆదిత్యుని అనుసరిస్తారు. యుగయుగాలుగా ప్రతి మాసములోని ఏకాదశులను పర మ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలతో జ్ఞానులు ప్రయోజనం పొందు తున్నారు. సాత్త్విక ఆహారాన్ని మితంగా తీసుకుంటూ భగవంతునికి దగ్గ రగా మనసును నిలపడమే ఉపవాసం. ఏకాదశి దీక్షలలో వైవస్వత మన్వం తర సప్తఋషులు అయిన వసిష్ట, అత్రి, గౌతమ, కశ్యప, భరద్వాజ, జమ దగ్ని, విశ్వామిత్రులు కూడా పూజలందు కుంటున్నారు. అమృత సిద్ధిని కలిగించే బీజాక్షర మంత్రములతో చేసే మానసిక పఠనం, నిశ్శబ్దశక్తి వలన మహాశక్తిని చేకూ ర్చుతుందని భావన. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు సూర్యాస్తమయం అనంతరం మహావిష్ణు నక్షత్రాలు ఉత్తర దిక్కున ఆకా శంలో శయనిస్తాయని అందువలననే ఈరోజు శయన ఏకాదశిగా పేర్కొ న్నారు. చాతుర్మాస్యవ్రతం ఈరోజు నుండే ప్రారంభిస్తారు. ఈ తొలి ఏకాదశి నాడే సూర్యుడు ఉత్తరాయణ కాలాన్ని విడిచి దక్షిణా యనంలో ప్రవేశిస్తాడు. ఈ కాలాన్ని విషమ కాలము, ముక్తి కాలమని తెలియచేసారు.
భాద్రపద శుక్ల ఏకాదశిని విష్ణు నక్షత్రాలు అంతర్హి తమవుతాయి. అందువలన ఈ ఏకాదశిని పరివర్తనా ఏకాదశి అంటారు. శ్రావణ ఏకాదశిని పుత్రదా ఏకాద శి అన్నారు. ఆశ్వయుజ ఏకాదశిని పాపం కుశ, మహా జ్జయ ఏకాదశి అన్నారు. కార్తీక శుక్ల ఏకాదశి నాడు విష్ణు నక్షత్రాలు పరివర్తన దశ నుండి తూర్పు దిక్కు న సూర్యోదయం కంటే పూర్వం దర్శనమిస్తాయి. దీనినే ఉత్థాన ఏకాదశి అన్నారు.
మార్గశిర శుక్ల ఏకాదశిన విష్ణు నక్షత్రాలు ఉపరి అర్థభాగం మాత్రమే దర్శనమిస్తాయి. దీనినే మోక్ష దా, ధృవ ఏకాదశి అని అన్నారు. పుష్యశుక్ల ఏకాదశికి విష్ణు నక్షత్రాలు సూర్యోదయానికంటే ముందు తూర్పు న ఉదయిస్తాయి.పరిపూర్ణ మహావిష్ణును బ్రహ్మ ముహూ ర్తంలో దర్శించవచ్చు. దీనినే వైకుంఠ ఏకాదశి అన్నారు.
మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ, జయ ఏకాదశి అన్నారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని అమలకి ఏకాదశిగాను, చైత్రశుద్ధ ఏకాదశిని కామద, కళ్యాణ ఏకాదశిగాను, వైశాఖ శుక్ల ఏకాదశిని మోహిని, కళ్యాణ ఏకాదశిగా ను, జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని త్రివిక్రమ, నిర్జల ఏకాదశిగాను భావిస్తారు. ఇక రెండు కళ్యాణ ఏకాదశులలో మొదటిది శ్రీ రాముడు, రెండవది రాధామాధవ కళ్యాణములకు ప్రత్యేకించారు. ము ఖ్యంగా శుక్లపక్ష ఏకాదశులకు ప్రా ధాన్యత ఇవ్వడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement