19. ముఖం బిందుంకృత్వాకుచయుగమధస్తస్యతదధో
హరార్థంధ్యాయేద్యో హర మహిషి తే మన్మథ కలాం
ససద్యస్సంక్షోభంనాయతి వనితా ఇత్యతి లఘు
త్రిలోకీమప్యాశుభ్రమయతిరవీందుస్తన యుగామ్!
తాత్పర్యం: ఓ శివుని పట్టమహిషీ! ముఖాన్ని బిందు స్థానంగాను, దాని క్రింది భాగాన్ని కుచయుగం గాను, ఇంకా క్రింద నున్న హరార్థాన్ని శక్తి లేదా త్రికోణం, లేదా యోని రూపంగాను భావించి ధ్యానం చేసే సాధకుడు కామాసక్తులైన స్త్రీలను చిత్తక్షోభానికి (మనసు కలవరపడేట్లు చేయటం) గురి చేస్తున్నాడు. సూర్యచంద్రులను స్తనయుగముగా కలిగిన త్రిలోకి ( స్వర్గ మర్త్య పాతాళ లోకాలు అనే స్త్రీ) ని భ్రమింప చేసేవాడికి ఇది పెద్దలెక్కలోనిది కాదు కదా!
– డాక్టర్ అనంత లక్ష్మి