18. తను చ్ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః
దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నానాంస్మరతి యః
భవంత్యస్యత్రస్యద్వనహరిణశాలీననయనాః
సహోర్వశ్యావశ్యాఃకతికతి న గీర్వాణగణికాః
తాత్పర్యం: అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి ఎర్రని కాంతి సౌభాగ్యాన్ని పోలి ఉన్న నీ దివ్య దేహపు అరుణ కాంతులలో ఈ భూమ్యాకాశాలు మొత్తం మునిగి ఉన్నట్టు ధ్యానం చేసే సాధకుడికి బెదురు చూపులతో అందగించే కన్నులున్న అడవి లేళ్ళ కన్నుల వంటి కన్నులున్న స్వర్గ లోకపు వేశ్యలైన అప్సరసలు, ఊర్వశితో సహా, ఎందుకు వశులు కారు?వశులౌతారని భావం.
– డాక్టర్ అనంత లక్ష్మి