17. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలా భంగ రుచిభిః
వశిన్యాద్యాభిస్త్వాం సహ జనని సంచింతయతి యః
స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిః
వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః.
తాత్పర్యం: తల్లీ! వాక్కు పుట్టటానికి మూలకారణమైన వారు, చంద్రాకాంతమణుల శకలముల కాంతి వలె ( తెల్లగా చల్లగా) ఉన్నవారు అయిన వశిని మొదలైన శక్తులతో కూడుకొని ఉన్నట్టుగా నిన్ను చక్కగా ధ్యానం చేసిన వాడు మహాకవుల రీతిలో రుచిరమైన వాగ్దేవీ ముఖమనే పద్మం నుండి వెలువడే సుగంధం వల్ల మధురంగా ఉండే వాక్కులతో కావ్యరచన చేయటానికి సమర్థుడు అవుతాడు.
– డాక్టర్ అనంత లక్ష్మి