Wednesday, October 30, 2024

సౌందర్యలహరి

16. కవీంద్రాణాం చేతః కమలవన బాలాతప రుచిం
భజంతే యేసంతః కతీచి దరుణామేవ భవతీమ్
విరించి ప్రేయస్యా స్తరుణ తర శృంగారలహరీ
గభీరాభిర్వాగ్భి ర్విదధతి సతాం రంజన మమీ.

తాత్పర్యం : కవీశ్వరుల చిత్తములు అనే పద్మవనానికి ఉదయభానుని వలె అరుణ వర్ణం తో ఉండే నిన్ను సేవించుకునే పండితులు సరస్వతీదేవి యొక్క నవ యవ్వన శృంగార రస ప్రవాహముల వలె ఉండు గంభీరమైన వాగ్విలాస సంపదతో సజ్జనుల హృదయాలని రంజింప చేస్తారు కదా!

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement