Friday, November 22, 2024

సౌందర్యలహరి

14. క్షితౌషట్పంచాశద్ద్విసమధికపంచాశదుదకే
హుతాశేద్వాషష్టిశ్చతురధికపంచాశదనిలే
దివి ద్విష్షట్త్రింశన్మనసిచ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగమ్.

తాత్పర్యం: అమ్మా! జగన్మాతా! భూతత్త్వానికి చెందిన మూలాధారచక్రము నందు 56,జలతత్త్వాత్మకమైనమణిపూరకచక్రమునందు 52,అగ్నితత్త్వానికి చెందిన స్వాధిష్ఠానచక్రము నందు 62,వాయుతత్త్వానికి చెందిన అనాహతపద్మమునందు 54,ఆకాశతత్త్వాత్మక మైన విశుద్ధిచక్రము నందు 72, మనస్తత్వ సంబంధ మైన ఆజ్ఞాచక్రము నందు 64 సంఖ్యలుగా ప్రకాశించే వెలుగుకిరణాలని అధిగమించి వాటి పైన నీ చరణకమలాలు ప్రకాశించుచున్నవి.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement