Sunday, December 1, 2024

సౌందర్యలహరి

48. కవీనాం సందర్భ స్తబక మకరందైకరసికం
కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణ యుగళం
అముంచన్తౌదృష్ట్వా తవ నవరసాస్వాదతరళా
వసూయాసంసర్గాదళికనయనంకించిదరుణం.

తాత్పర్యం: అమ్మా !జగజ్జననీ! మంచి కవుల రసవత్తర రచనలు అనే పూల గుత్తుల నుండి జాలువారే పూదేనెయందు మాత్రమే నీ చెవులు ఆసక్తి కలిగి ఉంటాయి. ఆ కారణంగా,నవరసాస్వాదనానుభూతిని పొందటంలో మిక్కిలి ఆసక్తి కలిగి ఉన్న నీ రెండు కన్నులు అనే గండు తుమ్మెదలుకడగంటి చూపులు అనే నెపం (వంక) తో ఆ రసాస్వాదనను వదల లేక నీ వీనుల జంటను అంటి పెట్టుకునే ఉన్నాయి. దీనిని చూసిన నీ లలాట నేత్రం అసూయని పొందటం వల్ల కొంచెం ఎర్ర బడింది.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement