47. విశాలా కల్యాణీ స్ఫుటరుచి రయోధ్యా కువలయైః
కృపాధారా 22ధారా కిమపి మధురా భోగవతికా
అవంతీ దృష్టిస్తే బహు నగర విస్తార విజయా
ధ్రువం తత్తన్నామవ్యవహరణ యోగ్యా విజయతే.
తాత్పార్యం: తల్లీ! నీ చూపు (నేత్రము) విశాలమై విశాల అనే నగరం పేరుతోను,కల్యాణవంతమై కల్యాణి అనే నగరం పేరుతోను, స్పష్టమైన కాంతి కలిగి నల్లకలువలు జయించలేని సౌందర్యం కలది అయి అయోధ్య అనే నగరనామంతోను,కృపారసప్రవాహానికి ఆధారమై ధారానగరనామంతోనూ, అవ్యక్త మధుర మనోజ్ఞమై మధురానగరనామంతోనూ, పరిపూర్ణ దృక్పథం ఉండటం వల్ల భోగవతికా నామంతోనూ, రక్షణ లక్షణంగా కలిగి ఉండటం వల్ల అవంతి అనే పేరుతోను, విజయం లక్షణంగా కలిగి ఉండటం చేత విజయ నగర నామంతోనూ పిలవటానికి తగినదైఅతిశయిస్తున్నది.
– డాక్టర్ అనంత లక్ష్మి