Friday, November 29, 2024

సౌందర్యలహరి

46. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా
త్రియామాం వామం తే సృజతి రజనీ నాయకతయా
తృతీయా తే దృష్టి ర్దర దళిత హేమాంబుజరుచి
స్సమాద్ధత్తేసంధ్యాం దివస నిశియోరంతరచరీమ్.

తాత్పర్యం: తల్లీ! నీ కుడికన్నుసూర్యసంబంధమైనది అవటం వల్ల పగటిని కలుగ చేస్తోంది. ఎడమకన్ను చంద్ర సంబంధమైనది అవటం వల్ల రాత్రిని పుట్టిస్తోంది. అప్పుడే వికసిస్తున్న ఎఱ్ఱతామర పూవు రంగులో ఉన్న నీ ఫాలనేత్రంరాత్రింబగళ్ళ మధ్య ఉండే ఉభయ సంధ్యలను ధరిస్తోంది.(అంటే సంధ్యలను కలిగిస్తోంది.)

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement