Saturday, January 4, 2025

సౌందర్యలహరి

45. లలాటం లావణ్యద్యుతి విమల మాభాతి తవ యత్
ద్వితీయంతన్మన్యే మకుట ఘటితంచంద్రశకలం
విపర్యాసన్యాసాదుభయమపిసంభూయ చ మిథహ్
సుధాలేపస్యూతిఃపరిణమతిరాకాహిమకరః

తాత్పర్యం: జగజ్జననీ! చంద్రరేఖని నీ కిరీటంలో అలంకరించుకోగా కనపడకుండా ఉన్న చంద్రుడిలో మిగిలిన భాగమే సౌందర్యాతిశయంతో ప్రకాశిస్తున్న నీ నుదురు అని నేను భావిస్తున్నాను. ఆ ఊహకి కారణం నీ లలాటాన్ని, కిరీటంలో ఉన్న చంద్రరేఖని వ్యత్యస్తంగా కలిపినట్లయితే అమృతాన్ని స్రవింప చేసే పూర్ణచంద్రుడి ఆకారం అవుతుంది. ఆ విధంగా స్రవించే అమృతంతోనే ఆ రెండు భాగాలు అతుకు కనపడ కుండా కలిసిపోయి పూర్ణచంద్రుడి లాగా భాసిస్తున్నాయి సుమా.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement