Wednesday, November 27, 2024

సౌందర్యలహరి

44. ఆరాళైస్స్వాభావ్యాదళికలభసశ్రీభి రలకైః
పరీతం తే వక్త్రంపరిహసతిపంకేరుహ రుచిం
దరస్మేరేయస్మిన్దశన రుచి కింజల్క రుచిరే
సుగంధౌమాద్యన్తిస్మర (మథన) దహన చక్షుర్మధులిహః.

తాత్పర్యం: చిఱునగవు అనే వికాసము కలిగి, దంతముల కాంతి అనే కేసరాల చేత అందముగా ఆవరించ బడి,సహజసుగంధముతో ఒప్పుతూ, స్వభావ సిద్ధంగా వంపు తిరిగి ఉండి,తుమ్మెదల కాంతి వంటి కాంతి గల ముంగురుల చేత అందముగా పరివేష్ఠించబడిన నీ ముఖము అనే పద్మాన్ని చూస్తూ శివుడి కన్నులు అనే తుమ్మెదలు ఆనంద పారవశ్యం చేత మత్తిల్లి ఉంటాయి. అటువంటి నీ వదనారవిందము పద్మముల వికాసము, సౌందర్యము తనతో సాటి రావని ఎగతాళి చేస్తున్నట్టుగా ఉన్నది.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement