43. తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్య లహరీ
పరీవాహశ్రోతస్సరణిరివ సీమంత సరణిహ్
వహన్తీసిందూరం ప్రబల కబరీభారతిమిర
ద్విషాంబృందైర్బందీకృతమివనవీనార్క కిరణం.
తాత్పర్యం: అమ్మా! నీ ముఖసౌందర్యపు కెరటాలు జాలువారే ప్రవాహాలు పారటానికి దారి చూపుతున్న కాలువ లాగా నీ పాపట కనబడుతున్నది. ఆ పాపటకి రెండు ప్రక్కలా వత్తుగా ఉన్న నీ నల్లని కురులు కటిక చీకటి రూపంలో రెండు వైపులా బృందాలుగా మోహరించి ఉన్న శత్రువుల లాగా ఉన్నాయి. నీ పాపటలో ఉన్న సిందూరపు రేఖ వాటి మధ్య బందీగా చిక్కుకున్న ఉదయసూర్యకిరణం లాగా భాసిస్తోంది. అటువంటి సిందూరరేఖ మాకు యోగక్షేమాలని విస్తరింప చేయు గాక!
– డాక్టర్ అనంత లక్ష్మి