42. ధునోతుధ్వాంతం న స్తులితదళితేందివరవనం
ఘన స్నిగ్ధ శ్లక్ష్ణంచికురనికురంబం తవ శివే
యదీయం సౌరభ్యం సహజ ముపలబ్ధుంసుమనసో
వసంత్యస్మిన్మన్యేబలమథనవాటీవిటపినామ్.
తాత్పర్యం: శుభములను కలిగించే తల్లీ, అప్పుడే వికసిస్తూ ఉన్న నల్లకలువలు దట్టంగా ఉన్న తోటలాగాను, మేఘమువలే నల్లగాను లేదా వత్తుగాను, సుగంధ తైలపు పరిమళాలతో నున్నగాను,మెరుస్తూను,మెత్తగాను ఉన్న నీ శిరోజాల సమూహాన్ని చేరి, ఆ కేశాలకి స్వభావసిద్ధంగా ఉన్న సుగంధాన్ని తాము పొందటం కోసం ఇంద్రుడి ఉద్యానవనమైన నందనవనంలో ఉండే కల్పవృక్షపు పూలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండే ఆ కేశపాశం మా హృదయ గత అజ్ఞానాంధకారాన్ని తొలగించు గాక.
– డాక్టర్ అనంత లక్ష్మి