41. గతైర్మాణిక్యత్వమ్ గగన మణిభిస్సాంద్రఘటితం
కిరీటం తే హైమం హిమగిరి సుతే కీర్తయతి యః
స నీడే యచ్చాయాచ్చురణ శబలం చంద్ర శకలం
ధను శ్శౌనాసీరంకిమితి న నిబధ్నాతిధిషణామ్.
తాత్పర్యం: మంచుమల పట్టీ, పార్వతీ, ఆకాశమునకు వెలుగు నిచ్చేమణులైనద్వాదశాదిత్యులనే రత్నాలతో దట్టముగా తాపడము చేయబడిన నీ బంగారు కిరీటమును ధ్యానము చేసే భక్తుడు – ఆ కిరీటములో పొదగబడిన ఆదిత్యులనే మణుల కాంతి వ్యాపించటం చేత ఎరుపు, పసుపు, నీలము, ఆకుపచ్చ మొదలైన వింత వింత రంగులను కలిగినదైన నీ నుదుటిపైఉన్నచంద్ర రేఖను చూచి అది ఇంద్రధనుస్సు అయి ఉంటుందని భావించి ధ్యానం చేస్తాడు.
– డాక్టర్ అనంత లక్ష్మి