Thursday, November 21, 2024

సౌందర్యలహరి

13. నరం వర్షీయాం సం నయన విరసం నర్మసు జడం
తవాపాంగాలోకే పతిత మనుధావంతిశతశః
గలద్వేణీబంధాఃకుచకలశవిస్రస్తసిచయాః
హఠాత్త్రుట్యత్కాంచ్యోవిగళితదుకూలాయువతయః

తాత్పర్యం: జగన్మాతా! నీ కృపా కటాక్షవీక్షణానికి పాత్రుడైన నరుడు ఎంత వృద్ధుడైనా, వికారమైన రూపం కలవాడైనా, కామకేళీ విలాసాలు తెలియని వాడైనా– వందల కొలది యువతులు అతడిని చూడగానే కొప్పు ముడులు విడివడుతుండగా, గుండెల పైనుండి జారిపడుతున్న పైటకొంగులతో,వదులైనపోకముడులు,మొలనూళ్లతో వెంట పరుగు పెడతారు కదా!  కురూపి అయిన ముసలి కూడా అమ్మ అనుగ్రహం ఉంటే మన్మథుడు లాగా అనిపిస్తాడని ఒక అర్థం. వయోభేదం లేక అందరు అతడి దివ్యతేజస్సుకిఆకర్షితులౌతారుఅని అసలు అర్థం.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement