39. తటిత్వంతమ్శక్త్యా తిమిర పరిపంధిస్ఫురణయా
స్ఫురన్నానా రత్నాభరణ పరిణద్ధేంద్రుధనుషం
తవ శ్యామం మేఘం కమపిమణిపూరైక శరణం
నిషేవేవర్షంతం హర మిహిర తప్తమ్త్రిభువనమ్.
తాత్పర్యం: జగదంబా! వివిధ రత్నాల చేత తయారు చేయబడిన నగలతో కూర్చబడిన ఇంద్ర ధనుస్సును కలిగి ఉండి,మణిపూరక చక్రంలో ఉండే చీకటికి శత్రువై ప్రకాశించే మెఱుపు శక్తిని కలిగి,నీలివన్నెలు గల హరుడనే సూర్యుడి చేత దగ్ధమైన మూడులోకాలకితాపోపశమనం కలిగే విధంగా వర్షించేది,ఇంతటిదిఅని చెప్ప నలవి కానిది అయి నీ మణిపూరకచక్రం తన నివాసస్థానంగా కల మేఘస్వరూపమైన శివుని చక్కగా సేవించెదను.
– డాక్టర్ అనంత లక్ష్మి