38. తవ స్వాధిష్ఠానేహుతవహమధిష్ఠాయ నిరతం
తమీడేసంవర్తం జనని మహతీంతాంచ సమయాం
యదాలోకేలోకాన్దహతి మహతి క్రోధకలితే
దయార్ద్రా యా దృష్టి శ్శిశిరముపచారంరచయతి.
తాత్పర్యం: జగజ్జననీ! నీ స్వాధిష్ఠాన చక్రంలో ఉన్న అగ్నితత్త్వాన్ని అధిష్ఠి0చి నిరంతరం వెలుగొందుతూ,‘సంవర్తకాగ్ని’ అనే పేరుతో జ్వలిస్తూ ఉండే పరమేశ్వరుణ్ణి, మహిమాన్వితము, మహనీయము అయిన ‘ సమయ’ అనే పేరుతో వెలుగొందే సంవర్తకాగ్ని స్వరూపిణి వైన నిన్ను స్తుతిస్తున్నాను. మహత్తరమైన ‘సంవర్తము’ అనే పరమేశ్వరుడి క్రోధాగ్నిలోకాలనన్నిటిని దహించగా, నీవు దయార్ద్రదృష్టి అనే శీతలోపచారాలతోలోకాలన్నిటికి ఉపశమనం కలిగించి, రక్షిస్తున్నావు.
– డాక్టర్ అనంత లక్ష్మి