37. సమున్మీలత్సంవిత్కమలమకరందైకరసికం
భజే హంస ద్వంద్వంకిమపిమానసచరం
యదాలాపాదష్టాదశగుణిత విద్యా పరిణతి
ర్యదాదత్తేదోషాద్గుణమఖిలమద్భ్యఃపయఇవ.
తాత్పర్యం: అమ్మా! చక్కగా వికసిస్తున్న జ్ఞానము అనే పద్మం ( అనాహత చక్రం) లో ఉన్న పూదేనెను ఆస్వాదించటం లో మాత్రమే ఆసక్తి కలిగినది,యోగీశ్వరుల మనస్సులనే సరోవరాల్లో విహరించేది, తమ సంభాషణలు పదునెనిమిది విద్యలుగా పరిణమింప చేసినది, నీళ్ళ నుండి పాలను విడదీసినట్టు దోషాల నుండి సమస్త సద్గుణాలను వేరుపరచగలది అయిన రాజ హంసల జంటను భజించుచున్నాను.
– డాక్టర్ అనంత లక్ష్మి