Monday, November 18, 2024

సౌందర్యలహరి

35. తవాజ్ఞా చక్రస్థం తపనశశికోటిద్యుతిధరం
పరం శంభుమ్వన్దేపరిమిళితపార్శ్వంపరచితా
యమారాధ్యన్భక్త్యారవిశశిశుచీనామవిషయే
నిరాలోకే 2 లోకేనివసతిహిభాలోక భువనే

తాత్పర్యం: అంబా! నీ ఆజ్ఞాచక్రంలో ఉన్న పరమశివునికి నమస్కరిస్తున్నాను. అతడు కోటానుకోట్ల సూర్యచంద్రకాంతులను ధరించి, ఒక పార్శ్వంలో ‘ పర’ అనే పేరున్న చిచ్ఛక్తితో కలిసి ఉన్నాడు. అంటే శివశక్తి సమన్వయస్వరూపంగా ఉన్నాడు. భక్తితత్పరతతో ఆరాధించి, ప్రసన్నం చేసుకున్న సాధకుడు సూర్యచంద్రాగ్నులు కూడా వెలిగించ లేనటువంటి, అంటే, వాటికి అతీతమై, వాటినే వెలించగలదైన,చర్మచక్షువులకి కనపడని ఏకాంత ప్రదేశమైన వెన్నెలలోకంలో నివసిస్తాడు. (నిండు వెన్నెలలోకం అంటే సహస్రార కమలం అని అర్థం).

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement