34. మనస్త్వంవ్యోమత్వంమరుదసిమరుత్సారధిరసి
త్వమాపస్త్వమ్భూమిస్త్వయిపరిణతాయాం న హి పరం
త్వమేవస్వాత్మానంపరిణమయితుంవిశ్వవపుషా
చిదానందాకారంశివయువతిభావేనబిభృషే.
తాత్పర్యం: శివుని ప్రియురాలవైన జగన్మాతా! ఆజ్ఞాచక్రమందున్న మనస్తత్వం, విశుద్ధిచక్రమందున్నఆకాశతత్త్వం, అనాహతచక్రమందున్న వాయుతత్త్వం,స్వాధిష్ఠానచక్రమందున్నఅగ్నితత్త్వం,మణిపూరచక్రమందున్నజలతత్త్వం, మూలాధార చక్రమందున్నభూతత్త్వం నీవే. పంచభూతాలు నీవే అయి ఉన్నప్పుడు నీకంటేఇతరమైనపదార్థం మరొకటి కొంచెం కూడా లేదు. నీ స్వరూపాన్ని విశ్వంగా పరిణమింప చేయటానికి చిచ్ఛక్తియుతుడైనఆనందభైరవుని స్వరూపాన్ని అంటే శివతత్త్వాన్ని నీ చిత్తంలో ధరిస్తున్నావు.
– డాక్టర్ అనంత లక్ష్మి