33. శరీరం త్వంశంభోశ్శశి మిహిర వక్షోరుహ యుగం
తవాత్మానంమన్యేభగవతి నవాత్మానమనఘం
అతశ్శేషశ్శేషీత్యయముభయ సాధారణ తయా
స్థితఃసంబంధోవాం సమరస పరానంద పరయోః
తాత్పర్యం: తల్లీ! భగవతీ! నీవు శివునికిచంద్రసూర్యులు వక్షోజములుగా కల శరీరం అయిఉన్నావు. నీ దేహాన్ని దోషరహితమైన నవవ్యూహాత్మకుడైనశివానందభైరవుడిగా భావన చేస్తున్నాను. ఒకరికొకరు దేహములై ఒప్పుచున్న మీ ఇద్దరి సమన్వయ స్వరూపాలకి శేషశేషీ సంబంధ సామరస్యము అంటే ఆధేయ– ఆధార, లేదా అప్రధాన – ప్రధాన సామరస్యము చెల్లుతుంది. అందుచేత మీరు ఆనందభైరవీఆనందభైరవులుగా ధృవీకరించ బడుతున్నారు.
– డాక్టర్ అనంత లక్ష్మి