Friday, November 15, 2024

సౌందర్యలహరి

32. స్మరంయోనింలక్ష్మీంత్రితయమిద మాదౌ
నిధాయైకే నిత్యే నిరవధిమహాభోగరసికాః
భజన్తిత్వాం చింతామణి గుణ నిబద్ధాక్ష వలయాః
శివాగ్నౌజుహ్వన్తస్సురభి ఘృత ధారాహుతి శతైః

తాత్పర్యం: ఓ నిత్యా స్వరూపిణీ,శాశ్వతురాలా! ఆనంద రసానుభవము తెలిసినవారు,సమయాచారపరులు అయిన కొంతమంది యోగీంద్రులు నీ మంత్రానికి ముందుగా కామరాజ బీజాక్షరమైన ‘క్లీం’, భువనేశ్వరీ బీజాక్షరమైన ‘హ్రీం’, లక్ష్మీ బీజాక్షరమైన ‘శ్రీం’లను చేర్చి అష్టాదశాక్షరిగా జపిస్తారు. వారు చింతామణులనే రత్నాలచే కూర్చబడిన అక్షమాలికలను చేతులలో ధరించి,శివాగ్నిఅని పేరు పొందిన స్వాధిష్ఠాగ్నిలో కామధేనువు యొక్క నేతిధారలు అనే ఆహుతులతో అనేక మారులు హోమం చేస్తూ,నిత్యాస్వరూపిణి వైన నిన్నే తమ హృదయాలలో నిలుపుకొని నిన్ను తృప్తి పరుస్తూ, నిరుపమానమైన, శాశ్వత మహాభోగరూపమైనసుఖానుభవాన్ని పొందుతున్నారు.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement