31. శివశ్శక్తిఃకామః క్షితి రథ రవి శ్శీతకిరణః
స్మరో హంస శ్శక్రస్తదనుచపరామార హరయః
అమీహృల్లేఖాభిస్తిసృభిరవసానేషుఘటితాః
భజంతేవర్ణాస్తే తవ జనని నామావయవతాం
తాత్పర్యం: జననీ! శివుడు (‘క’ కకారము), శక్తి ( ‘ఏ’ కారము), మన్మథుడు (‘ఈ’ కారము), భూమి (‘ఏ’ కారము), ఆ తరువాత సూర్యుడు ( ‘హ’ కారము), చంద్రుడు (‘స’ కారము), మన్మథుడు (‘క’ కారము), సూర్యుడు (‘హ’ కారము),ఇంద్రుడు (‘ల’కారము), అనే వాటి తరువాత పరాశక్తి ( ‘స’ కారము), మన్మథుడు ( ‘క’ కారము), విష్ణువు ( ‘ల’ కారము), అనే మూడు వర్గాలుగా ఉన్న ఈ వర్ణాలు వర్గాల చివర మూడు ‘హ్రీం’కారముల చేత కూడుకొని నీ పేరులో అంతర్భాగాలై (నీ అవయవాలై) మంత్రస్వరూపాన్ని పొందుతున్నాయి. అనగాఈపదునైదు వర్ణాలు అమ్మవారికి చెందిన పంచదశాక్షరీమంత్రస్వరూపానికి అవయవాలై అందగిస్తున్నాయి.
– డాక్టర్ అనంత లక్ష్మి