Saturday, October 26, 2024

సౌందర్యలహరి

త్వదీయమ్ సౌందర్యం తుహినగిరికన్యేతులయితుం
కవీంద్రాఃకల్పంతేకథమపి విరించి ప్రభృతయః
యదాలోకౌత్సుక్యాదమర లలనా యాంతి మనసా
తపోభిర్దుష్ప్రాపామపిగిరిశ సాయుజ్య పదవీమ్

తాత్పర్యం: మంచుమలపట్టీ! నీ అందాన్ని పోల్చి చెప్పటానికి బ్రహ్మ మొదలైన కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకపోతున్నారు. అటువంటి నీ సౌందర్యాన్ని చూడాలనే అంతులేని కుతూహలంతో దేవకాంతలు తపస్సుచేత కూడా పొందటం కష్టమైన శివసాయుజ్యమనే పదవిని మనస్సుచేత పొందుతున్నారు.

– డాక్టర్‌ అనంత లక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement