26. విరించిఃపంచత్వంవ్రజతి హరి రాప్నోతివిరతిం
వినాశం కీనాశోభజతిధనదోయాతినిధనం
వితంద్రీమాహేంద్రీవితతిరపిసమ్మీలితదృశా
మహాసంహారేస్మిన్విహరతి సతి త్వత్పతిరసా!
తాత్పర్యం: తల్లీ! జగజ్జననీ! ఈ లోకానికి మహాప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మ, విష్ణువు, యముడు, కుబేరుడు, ఇంద్రుడు మొదలైన వారందరు కాలధర్మం చెందుతున్నారు. కాని, నీ భర్త అయిన సదాశివుడు మాత్రం ఎటువంటి మార్పులకి గురికాకుండా చిద్విలాసంగా విహరిస్తున్నాడు.
– డాక్టర్ అనంత లక్ష్మి